టాలీవుడ్ ఇంట్రెస్ట్ కు సంబంధించిన హీరో లలో ఇప్పటికే చాలా మంది ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నారు . అలా ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో లలో ప్రభాస్ , అల్లు అర్జున్ కూడా ఉన్నారు . ఇకపోతే ఇండియా వ్యాప్తం గా క్రేజ్ ఉన్న హీరోలు నటించిన సినిమాలకు అద్భుతమైన కలెక్షన్లు వస్తుంటాయి . ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా వారు నటించిన సినిమాలకు వందల కోట్ల కలెక్షన్లు వస్తుంటాయి. ఒక వేళ హిట్ టాక్ కనుక వచ్చినట్లయితే వారు నటించిన సినిమాలకు కలెక్షన్ల వర్షం కురుస్తూ ఉంటుంది.
దానితో వారి సినిమాలకు పారితోషకాలు కూడా అదిరిపోయే రేంజ్లో ఇస్తుంటారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోల లిస్టులో ప్రభాస్ , అల్లు అర్జున్ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రభాస్ తాజాగా హాంబులే ఫిలిమ్స్ బ్యానర్లో వరుసగా మూడు సినిమాలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ బ్యానర్ లో మూడు సినిమాలు చేసేందుకు గాను ప్రభాస్ ఏకంగా 600 కోట్ల పారితోషకాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దానితో ఒక్కో మూవీ కి 200 కోట్ల రెమ్యూనరేషన్ను ప్రభాస్ పుచ్చుకోబోతున్నట్లు సమాచారం.
ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. పుష్ప పార్ట్ 1 కి తక్కువ గానే పారితోషకం తీసుకున్న ఈయన పుష్ప పార్ట్ 2 కు మాత్రం ఏకంగా 300 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా టాలీవుడ్ హీరోలు ఇద్దరు భారీ స్థాయిలో పారితోషకాలను అందుకుంటు బాలీవుడ్ హీరోలను మించిపోతున్నారు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.