మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ "ముకుంద" అనే సినిమాతో కెరీర్ ను మొదలు పెట్టాడు. కొత్త బంగారు లోకం , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని తనకంటూ సూపర్ క్రేజ్ ను దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో ఏర్పరచుకున్న శ్రీకాంత్ అడ్డాల ముకుంద సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి క్రేజ్ కలిగిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన సినిమాతో వరుణ్ తేజ్ వెండి తెరకు పరిచయం కానుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
కానీ ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఆ తర్వాత ఈయన సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వచ్చాడు. దానితో కెరియర్ ప్రారంభంలో ఈయనకు మంచి విజయాలు దక్కాయి. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం వరుణ్ తేజ్ కు వరుసగా అపజయాలు దక్కుతున్నాయి. ఇకపోతే తాజాగా వరుణ్ తేజ్ "మట్కా" అనే సినిమాలో హీరో గా నటించాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ మూవీ కి కరుణ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని నవంబర్ 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే కొంత కాలం క్రితం వరుణ్ , సంకల్ప రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణం లో బడ్జెట్ అని తెలుస్తుంది.
ఈ సినిమాలో భారీ వి ఎఫ్ ఎక్స్ పనులు ఉండడంతో 5 కోట్ల వరకు దానికే ఖర్చు పెట్టారట. ఇక మిగతా వాటికి 10 కోట్ల ఖర్చు అయ్యిందట. దానితో మొత్తంగా ఈ సినిమా కోసం 15 కోట్లు ఖర్చు చేశారట. ఇక బడ్జెట్ పెరిగిపోవడంతో ఖర్చు తగ్గించడం కోసం ఐదు రోజుల షూటింగ్ ను కూడా తగ్గించారట. అలా బడ్జెట్ కారణంగా కొంత వరకు కాంప్రమైజ్ కావడంతో ఆ సినిమా పెద్ద విజయాన్ని అందుకోలేదు అని ఓ వార్త వైరల్ అవుతుంది.