యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నాడు. కొంత కాలం క్రితం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా ప్రపంచ వ్యాప్తంగా అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. దానితో ఈ సినిమా తర్వాత నుండి ఈయన వరుస పెట్టి భారీ బడ్జెట్ సినిమాలలో , పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈయన తాజాగా దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సినిమా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి 500 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ "వార్ 2" అని హిందీ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్లో పాల్గొంటూ , మరో మూవీ కి కమిట్ అయి ఉన్న ఎన్టీఆర్ మరో మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అసలు విషయం లోకి వెళితే ... తమిళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తారక్ ఓ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెల్సన్ , తారక్ కి ఓ కథను వినిపించగా ఆ కథ సూపర్ గా నచ్చడంతో నెల్సన్ దర్శకత్వంలో సినిమా చేయడానికి తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొంత కాలంలోనే వెలువడబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.