ఎన్టీఆర్ కి అర్ధ రాత్రి ఫోన్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చిన టాలీవుడ్ సీనియర్ హీరో .. ఏమైందంటే..?
"వాళ్లు కాదు నువ్వే అడిగేలా ఉన్నావ్" అంటూ చాలా కోపంగా కఠినంగా మాట్లాడారు . అప్పట్లో ఈ న్యూస్ బాగా హాట్ హాట్ గా ట్రెండ్ అయింది . అంత కోపం జూనియర్ ఎన్టీఆర్ కి. అయితే అలాంటి కోపం ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కి ఫోన్ చేసి మరి ఒక తెలుగు స్టార్ సీనియర్ హీరో వార్నింగ్ ఇచ్చారట . ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!
జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మహా మొండోడు . మహా అల్లరోడు కూడా . ఎంతలా అంటే ఒకానొక ఇంటర్వ్యూలో చిరంజీవి గారి గురించి ప్రశ్న ఎదురైనా సరే ..చిరంజీవి కి సంబంధించి స్టార్ హీరో అని చెప్పకుండా.." నాకు తెలిసినంతవరకు ఇండస్ట్రీలో టాప్ హీరో అంటే మా తాతగారు అనే విధంగా ఆన్సర్ ఇచ్చారట". అప్పట్లో ఆయన మాటలు బాగా మెగా ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి. దీంతో నాగార్జున.. ఎన్టీఆర్ కు కాల్ చేసి మరి ఆయనకు వార్నింగ్ ఇచ్చారట.
"నీకు చాలా భవిష్యత్తు ఉంది. ఇండస్ట్రీలో ఇలాంటి మాటలు కోపంతో మాట్లాడితే అస్సలు నిలదొక్కుకోలేవు. ఇకనైనా కోపం తగ్గించుకో అంటూ చిరంజీవికి కాల్ చేసే సారీ చెప్పమంటూ సజెస్ట్ చేసారట ". అయితే ఎన్టీఆర్ ..నాగార్జున మాటలను బాగా విని నిజమే అంటూ తప్పు రియలైజ్ అయ్యి "సారీ సార్ మిమ్మల్ని బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు" అంటూ ఆయనను క్షమించమని కోరారట. చిరంజీవి పెద్దమనసుతో ఎన్టీఆర్ ని క్షమించేసాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి..!