ఏఎన్ఆర్ కు తెలిస్తే చంపేస్తాడని.. ఆ పని చేయడానికి నాగార్జున అంతకు తెగించాడుగా..!

Amruth kumar
మన తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో ఎవరంటే టక్కున ఎవరికైనా గుర్తుకొచ్చే పేరు అక్కినేని నాగార్జున.. ఆయన్ని చూస్తూంటే ఇతనికి ఆరుపదులు వయసు వచ్చిందా అనే ఆశ్చర్యం కూడా ప్రతి ఒక్కరికి కలగక మానదు. మొదటి నుంచి తన ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టికి పెట్టిన నాగార్జున ఇప్పటికీ యంగ్ కుర్రాడి మాదిరిగా కనిపిస్తాడు. అలాంటి నాగార్జునకి ఎలాంటి చెడు అలవాట్లు లేవా అనే సందేహం అందరిలో కూడా ఉంటుంది. అయితే యంగేజ్ లో ఉన్నప్పుడు తండ్రి నాగేశ్వరరావు కి తెలియకుండా నాగార్జున అప్పుడప్పుడు బీరు తాగేవాడట.. ఇక దొంగచాటుగా ఆ పని చేసే వాడిని నాగార్జుననే ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. అక్కినేని నాగేశ్వరరావు తన ఇంట్లో ఎంతో సిస్టమ్యాటిక్ తండ్రిగా ఉండేవాడట.

ఆయన తన పిల్లల విషయంలో ఎంతో స్ట్రిక్ట్ అని, అల్లరి చిల్లరగా ఎవరిని తిరగనిచ్చేవారు కాదని నాగార్జున చెప్పుకొచ్చారు.. నాగేశ్వరరావు పెద్ద కొడుకు వెంకట్ సహా ఇతర ఆడపిల్లలంతా ఎంతో భాగా ఉండేవారు.. కానీ నాగార్జునకు మాత్రం చిన్నప్పుడు నుంచి కొంచెం కొంటె పనులు ఎక్కువగా చేసి అమ్మా నాన్నలకు దొరికిపోయే వారట. నాగార్జునకి బీరు తాగే అలవాటు ఉందని ఏఎన్ఆర్ కి తెలిస్తే కొడతార‌ని తెలిసి దాన్ని దొంగ చాటుగా తాగేసేవాడట. ఇక దానికోసం అన్నపూర్ణ స్టూడియోస్ ని కూడా వాడుకునే వాడుట. అయితే ఆ స్టూడియోలో ఒక ఖాళీ ప్లేస్ కూడా ఉండేది.. దట్టమైన చెట్లకు మధ్యకి నెమ్మదిగా వెళ్లి బాటిల్ తీసుకొని అక్కడ ఎవరూ చూడకుండా బీర్ తాగేసే వాడట నాగార్జున.

రీసెంట్గా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా చెప్పుకొచ్చాడు.. తనకు తెలియని ప్లేసులు అన్నపూర్ణ స్టూడియోలో చాలా ఉన్నాయి అని కూడా అన్నారు. ఇప్పుడు నాగార్జున చాలా ప‌ద్ద‌తిగా ఉంటూ త‌న‌ ఆరోగ్యం విష‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. తాను అన్నీ తింటానని, కానీ రాత్రి పడక ముందే అన్నీ కంప్లీట్‌ చేస్తానని నాగ్ ఎప్పుడు చేబుతాడు. వైన్ కూడా కొద్దిగా తీసుకుంటానని, నాన్‌ వెజ్‌తో పాటు, వెజ్‌ కూడా తీసుకుంటానని అంటారు. నాటు కోడి అంటే చాలా ఇష్టమని , రాత్రి పడుకునే ముందు కొంత స్వీట్‌ తీంటానని కూడా నాగార్జున‌ వెల్లడించారు. ఇక నాగార్జున ఇప్పుడు ధనుష్‌ హీరోగా వ‌స్తున్న‌ కుబేర సినిమాలో ముఖ్య‌మైన పాత్రలో న‌టిస్తున్న‌డు.. అలాగే  రజనీకాంత్‌తో కలిసి కూలీ సినిమాలో నటిస్తున్నారు. ఇలా వ‌రుస సినిమాలో నాగ్ బిజిగా ఉన్న‌డు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: