గ్లోబల్ స్టార్ రాంచరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్ “..ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ మొదలై చాలా కాలం అయినా కూడా షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది.. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. భారతీయుడు 2 రూపంలో గేమ్ ఛేంజర్ కు అనుకోని ఇబ్బందులు వచ్చాయి..శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 జులై 12న రిలీజ్ అయి ఊహించని డిజాస్టర్ గా నిలిచింది.. దీనితో ఆ సినిమా ఎఫెక్ట్ చరణ్ మూవీపై పడుతుందేమో అని చరణ్ ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు.. దీనికి తోడు సినిమాకు సంబంధించి అప్డేట్స్ కూడా లేట్ గా ఇస్తుండటంతో మూవీ టీంపై ఫ్యాన్స్ గుర్రుగా వున్నారు.. ఇదిలా ఉంటే ఈ సినిమాను జనవరి 10, 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు..
ఈ దీపావళికి గేమ్ ఛేంజర్ నుంచి టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించినా అది కుదర్లేదు.. దీనితో టీజర్ ను నవంబర్ 9 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.. అలాగే నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు.. ఇదిలా ఉంటే భారతీయుడు 2 తో మరింత డౌన్ ఫాల్ అయిన శంకర్ గేమ్ ఛేంజర్ తో సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.. రాంచరణ్ మూవీ తరువాత శంకర్ స్టార్ హీరోలతో కాకుండా కొత్త వారితో ఓ క్యూట్ లవ్ స్టోరీ తీయాలనీ చూస్తున్నట్లు సమాచారం.. గతంలో తెరకెక్కించిన బాయ్స్ సినిమా మాదిరి ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది..గతంలో వచ్చిన బాయ్స్ సినిమా మంచి విజయం సాధించింది.. దీనితో శంకర్ మంచి డెసిషన్ తీసుకున్నారని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు..అయితే గేమ్ ఛేంజర్ రిజల్ట్ పై శంకర్ భవిష్యత్ ఆధారపడి వుంది..