దివ్య శ్రీధర్ - క్రిష్ వేణుగోపాల్ బుల్లితెర కొత్త పెళ్లికూతురు, పెళ్లి కొడుకు మధ్య ఏజ్ తేడా ఎంతో తెలుసా..?
ముసలాడిలాగానే పెళ్లి పీటలపై కూర్చుని తన ప్రేయసి మెడలో మూడు ముళ్ళు వేశాడు. తన పిల్లల ఎదుట రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో సహజంగా సోషల్ మీడియాలో వీరిని ఒక ఆట ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో దివ్య శ్రీధర్ స్పందించి తమ వయసు మరీ ఎక్కువ కాదని పెదవిపింది. తన వయసు 40 సంవత్సరాలు అని.. క్రిష్ వయసు 49 సంవత్సరాలు అని పేర్కొంది. తము శారీరిక వాంచ కోసం పెళ్లి చేసుకోలేదని.. ఒకరికి ఒకరం తోడు కోరుకున్నామని వెల్లడించింది. ఇక వేణుగోపాల్ మాట్లాడుతూ తాను మొదటి భార్యతో సంతోషంగా లేనని.. ఆమె తన స్వేచ్ఛను దూరం చేసింది.. నా కుటుంబంతో కూడా మాట్లాడించేది కాదు.. ఎన్నో షరతుల విధించింది.
ఎవరు మా ఇంటికి కూడా వచ్చేవారు కాదు.. కనీసం ఫోన్లో కూడా మాట్లాడేందుకు ఒప్పుకునేది కాదు.. నన్ను ఒక మనిషిలా కాకుండా పెంపుడు జంతువులా చూసేదని.. అందుకే జీవితంపై విరక్తితో విడాకులు ఇచ్చేసానని తెలిపాడు. 2019లో విడాకులకు దరఖాస్తు చేయగా 2022లో విడాకులు వచ్చాయని.. కొన్ని నెలలపాటు ఏ తోడు లేకుండా బతకడం కష్టంగా అనిపించింది. అందుకే దివ్యను రెండో పెళ్లి చేసుకున్నాను అని తెలిపారు. మా రెండో పెళ్లి గురించి తప్పుగా మాట్లాడుతుంటే చాలా బాధగా ఉందని చెప్పారు. ఇక వేణుగోపాల్ బుల్లితెరపై పలు సీరియల్స్‌లో తాతగా నటించాడు. కొన్ని మలయాళ సినిమాలలో కూడా నటించి బాగా పాపులర్ అయ్యాడు.