లక్కీ భాస్కర్ : 6 రోజుల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్.. ఎంత లాభమో తెలుసా..?

Pulgam Srinivas
దుల్కర్ సల్మాన్ తాజాగా లక్కీ భాస్కర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. జీ వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ ను అక్టోబర్ 30 వ తేదీన ప్రదర్శించారు. ఈ మూవీ కి పెయిడ్ ప్రీమియర్ ద్వారానే మంచి టాక్ రావడంతో ఆ తర్వాత నుండి సూపర్ సాలిడ్ కలెక్షన్స్ ఈ మూవీ కి వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఆరు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ ఆరు రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకి ఇప్పటివరకు ఎంత లాభం వచ్చింది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

6 రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 6.78 కోట్లు , సీడెడ్ లో 1.66 కోట్లు , ఆంధ్ర లో 5.16 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. మొత్తంగా ఈ మూవీ కి 6 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 13.60 కోట్ల షేర్ ... 21.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. లక్కీ భాస్కర్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.2 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 15 కోట్ల టార్గెట్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని 1.40 కోట్ల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: