పొలిటీషియన్ కూతురితో యాంకర్ ప్రదీప్ పెళ్లి.. బ్యాక్గ్రౌండ్ మాములుగా లేదు భయ్యో.?

Pandrala Sravanthi
 చాలామంది సెలబ్రిటీల అభిమానులు హీరోలకు సంబంధించిన గుడ్ న్యూస్ లు ఎప్పుడెప్పుడు చెబుతారా అని ఎదురుచూస్తూ ఉంటారు. అలా ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రిటీల పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ వినడానికి రెడీగా ఉన్నారు. అయితే హీరోలతో పాటు యాంకర్ ప్రదీప్, యాంకర్ శ్రీముఖి, యాంకర్ రష్మీ, యాంకర్ సుదీర్ వంటి సెలబ్రిటీల పెళ్లిళ్లు చూడడానికి కూడా ఎంతోమంది అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే చాలా సంవత్సరాల నుండి యాంకర్ ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకైతే పెళ్లి జరగలేదు.ఇక గతంలో అయితే యాంకర్ ప్రదీప్ కి ఏకంగా స్వయంవరం ప్రకటించి ఒక పెద్ద షోనే చేశారు.ఆ షోలో విన్ అయిన అమ్మాయిని యాంకర్ ప్రదీప్ పెళ్లి చేసుకుంటారని కూడా వార్తలు వినిపించాయి.

కానీ చివరికి ఇది మొత్తం షో కోసమేనని తెలియడంతో అందరూ షాక్ అయిపోయారు. అయితే అలాంటి యాంకర్ ప్రదీప్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.అది కూడా ఓ రాజకీయ నాయకుడి కూతురిని అని సమాచారం. ఫిలిం ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం..యాంకర్ ప్రదీప్ కి రాజకీయ నాయకుడు కూతురితో పెళ్లి ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.అయితే ఇది పూర్తిగా పెద్దలు ఫిక్స్ చేసిన పెళ్లేనని తెలుస్తోంది. ఇక ప్రదీప్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాగ్రౌండ్ మామూలుగా లేదని, ఆమె వేలకోట్ల ఆస్తికి వారసురాలని తెలుస్తోంది.

ఇక ఈ వార్త మీడియాలో వైరల్ అవ్వడంతోనే ప్రదీప్ మామూలోడు కాదు భయ్యో..బ్యాక్ గ్రౌండ్ గట్టిగానే ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.అయితే ఈ విషయం తెలిసిన కొంతమంది మాత్రం యాంకర్ ప్రదీప్ పెళ్లి వార్తలు పూర్తిగా రూమరేనని, త్వరలోనే ఆయన కొత్త సినిమాతో రాబోతున్నారు కాబట్టి తన సినిమాకి ప్రమోషన్ అవుతుంది అని ఇలా కొంతమంది ప్రదీప్ పెళ్లి వార్తలు ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: