జూనియర్ ఎన్టీఆర్ ని "రేయ్ బండోడా" అంటూ ముద్దుగా పిలిచే వ్యక్తి ఎవరో తెలుసా..?

Thota Jaya Madhuri
చనువుంటే ఎవరు ఎలా పిలిచినా కూడా ఏమాత్రం పట్టించుకోరు జనాలు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో ఫ్యాన్స్ తమ హీరోకి స్పెషల్ రెస్పెక్ట్ ఇవ్వాలి అని.. పేరు వెనకాల గారు ..పేరుకు ముందు ది అంటూ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలని చాలామంది  చెప్పుకొస్తూ ఉంటారు . అయితే పలువురు  స్టార్ హీరోస్ పక్క వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తూ పిలివాలి అని అనుకుంటారేమో గాని ..తమ దగ్గరగా ఉండే రిలేషన్ వాళ్లు అసలు రిలేషన్ లేకుండా ఉండి ఫ్రెండ్షిప్ తో బాండింగ్ ఏర్పరచుకున్న వాళ్ళు ఎలా పిలిచినా పర్వాలేదు అనుకుంటూ ఉంటారు . ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ .


నమ్మకానికి నిజాయితీకి మరో మారుపేరుగా పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గానే కొరటాల శివ దర్శకత్వంలో "దేవర" అనే సినిమాతో అందరికీ హాయ్ చెప్పి పలకరించాడు . త్వరలోనే దేవర 2 ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. వార్ 2 సినిమాకి సంబంధించిన థార్డ్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది . అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ మొదటి వారంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకోరాబోతున్నాడట . ఇలా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్లిపోతున్న తారక్ కి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి .


ఇదే క్రమంలో పర్సనల్ విషయానికి సంబంధించిన మ్యాటర్ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. చాలామంది తారక్ ని ముద్దుగా తారక్ - జూనియర్ ఎన్టీఆర్ -యంగ్ టైగర్ ఇలా పిలుచుకుంటూ ఉంటారు అయితే ఇండస్ట్రీలో ఉండే ఒకే ఒక్క వ్యక్తి మాత్రం తారక్ ను "బండోడా" అంటూ ముద్దుగా పిలుస్తుందట . ఆమె మరెవరో కాదు "వల్లి". కీరవాణి భార్య.  కీరవాణి భార్య వల్లి.. ప్రభాస్ - రానా దగ్గుబాటి- అనుష్కలకు చాలా చాలా క్లోజ్ . తారక్ కి అయితే ఇంకా ఇంకా క్లోజ్. ఆమె ఇంట్లోకి వెళ్లి కూడా కావాల్సింది వండించుకుని తినేంత చనువు వుంది. అయితే అందరూ యంగ్ టైగర్ అంటూ పిలిచిన వల్లి గారు మాత్రం "బండోడా" అంటూ ముద్దుగా పిలుస్తూ వచ్చేదట . స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి ఈ పేరుతో పిలుస్తూ వచ్చిందట . తారక్ లావు తగ్గిన కూడా ఇప్పటికి ఆమె  ఆ పేరుతోనే పిలుస్తూ వస్తుందట . అంత చనువు తారక్ తో ఆమెకి ఏర్పడింది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: