ఓటీటీలోకి వచ్చేసిన దేవర.. ఇక్కడా ఎన్టీఆర్ తాండవమేనా?

Veldandi Saikiran
మ్యాన్ ఆఫ్ మోసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం దేవర. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో హై లెవెల్ గ్రాఫిక్స్ తో ఈ సినిమాను ప్రారంభించారు. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ బ్యూటీ ఇందులో తంగం పాత్రలో ఒదిగిపోయి నటించింది.

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అనంతరం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా.... దేవర డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడు వస్తుందా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ దేవర సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది.

అందువల్ల దేవర నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ కానుంది. దేవర డిజిటల్ హక్కుల అమ్మకాలు జరిగినప్పుడే థియేటర్స్ లో విడుదలైన ఎనిమిది వారాల అనంతరం మాత్రమే ఓటిటి రిలీజ్ చేసేందుకు మేకర్స్ డీల్ చేశారట. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

ఇప్పటికే సోషల్ మీడియాలో నెట్ ఫ్లిక్స్ తప్ప మిగతా వారందరూ నెట్ ఫ్లిక్స్ లోగోతో దేవర 8వ తేదీన రాబోతుంది అని అనేక రకాలుగా పోస్టులు పెడుతున్నారు. అయితే నెట్ ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతనే దేవర ఎనిమిది నుంచి వస్తుందా లేక అంతకు ముందే వస్తుందా అనేది చూడాలి. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో వస్తే చూడాలని ప్రతి ఒక్క సినీ అభిమాని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: