సమర సింహారెడ్డి సెన్షేషనల్ హిస్టరీ..77 కేంద్రాల్లో 100 రోజులు ?
* 77 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సమరసింహారెడ్డి
* బి.గోపాల్ రెడ్డి దర్శకత్వం
* సమరసింహారెడ్డిని మిస్ చేసుకున్న విక్టరీ వెంకటేష్
నందమూరి బాలకృష్ణ గురించి తెలియని సినీ అభిమానులు ఉండరు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే పెద్ద స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ. సినిమాల్లోనే కాకుండా.. రాజకీయాల్లోనూ దూసుకెళుతున్నారు. అయితే... నందమూరి బాలకృష్ణ తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. అలాంటి బాలకృష్ణ కెరీర్ లో సమరసింహారెడ్డి సినిమా ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో చెప్పనవసరం లేదు.
1999 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఎన్నో సినిమాలతో పోటీపడి విజయాన్ని అందుకుంది. అదే సమయంలో చిరంజీవి నటించిన స్నేహం కోసం సినిమా కూడా రిలీజ్ అయింది. అయినప్పటికీ బాలకృష్ణ సినిమానే భారీ వసూళ్లను రాబట్టింది. బి.గోపాల్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 77 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలోనే ఇదే పెద్ద రికార్డు.
ఆ తర్వాత నాలుగేళ్ల అనంతరం మళ్లీ బాలయ్య బాబు నటించిన నరసింహనాయుడు సినిమానే వంద రోజులు ఆడింది. ఈ సినిమాలో బాలయ్య బాబుతో సిమ్రాన్, అంజలా జువేరి, సంఘవి నటించారు. నరసింహనాయుడు సినిమాలో మొదట బాలయ్య బాబును కాకుండా విక్టరీ వెంకటేష్ ను అనుకున్నారట. కానీ ఈ సినిమా కథ విన్నా వెంకటేష్ తనకు ఈ సినిమా కథ సెట్ కాదని ఎవరైనా మాస్ హీరో ఈ సినిమా చేస్తే బాగుంటుందని చెప్పారట.
ఇక ఈ విషయం చెప్పిన అనంతరం విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను బాలయ్య బాబుకు వినిపించారట. బాలయ్య వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పి షూటింగ్ ప్రారంభించారట. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. చివరకు ఈ సినిమా తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది. బాలయ్య బాబు కెరీర్ లోనే స్పెషల్ సినిమాగా నరసింహనాయుడు నిలిచిపోయింది.