11 ఏళ్ల కొడుకు ఉన్న ఆంటీతో క్రిష్ రెండో పెళ్లి?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది డిఫరెంట్ కథలతో సక్సెస్ అవుతుంటే... మరి కొంతమంది... భిన్నమైన స్టోరీలు తీసుకువచ్చి... తక్కువ టైంలో సక్సెస్ అవుతున్నారు. పెద్ద హీరోలతో చాన్సులు కొట్టేస్తున్నారు. అలాంటి వారిలో జాగర్లమూడి రాధాకృష్ణ ఒకరు. దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇతని అందరూ సింపుల్గా క్రిష్ అని పిలుస్తారు. గుంటూరు కు చెందిన దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ.. తక్కువ టైంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యాడు.

ఎన్నో సక్సెస్ సినిమాలను కూడా తీసి... ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈయన తీసిన ప్రతి సినిమా  కు కచ్చితంగా అవార్డు రావాల్సిందే. నంది అవార్డులకు పెట్టింది పేరు క్రిష్. 2008 సంవత్సరంలో.. క్రిష్ తన మొదటి సినిమా తీశాడు. ఆ సినిమానే గమ్యం. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అయింది. శర్వానంద్ అల్లరి నరేష్ కమల్ని ముఖర్జీ.. ముగ్గురితో కలిపి మంచి ఎమోషనల్ సినిమా తీశాడు. తన తొలి సినిమాతోనే ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు అవార్డు, నంది అవార్డు గెలుచుకున్నాడు.

ఆ తర్వాత వేదం, తమిళంలో వానమ్, కృష్ణం వందే జగద్గురుం,  కంచె, గౌతమీపుత్ర శాతకర్ణ లాంటి బంపర్ హిట్ సినిమాలు తీశాడు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో... మరో సినిమా తీస్తున్నాడు దర్శకుడు క్రిష్. అయితే సినిమాలతో వరుసగా బిజీగా ఉన్న.. దర్శకుడు క్రిష్.. త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడట. ఈ మేరకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.  11 సంవత్సరాలు కుమారుడు ఉన్న ఓ డాక్టర్ అమ్మాయిని... దర్శకుడు క్రిష్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడట.

కొన్ని సంవత్సరాల కిందట అంటే 2016 సమయంలో... క్రిష్ మొదటి వివాహం జరిగింది. డాక్టర్ రమ్య వెలగ  అనే అమ్మాయితో హైదరాబాదులో వివాహం జరిగింది. అయితే వీరిద్దరి మధ్య గొడవలు జరిగి విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పుడు 11 సంవత్సరాల కుమారుడు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. వచ్చే వారమే ఎంగేజ్మెంట్ కూడా జరగబోతుందట. క్రిష్ పెళ్లి చేసుకోబోతున్న రెండవ భార్య కూడా డాక్టర్ అని సమాచారం. దీనిపై త్వరలోనే ప్రకటన రానుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: