కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువ శాతం కమర్షియ ల్ ఎంటర్టైనర్ మూవీ లను ప్రేక్షకులు ఇష్టపడుతూ ఉండేవారు . దానితో స్టార్ హీరోల దగ్గర నుండి మొదలు పెడితే మీడియం రేంజ్ , చిన్న హీరో లు కూడా ఎక్కువ శాతం యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లను చేయడానికి ఎక్కువ గా ఇష్ట పడుతూ ఉండేవారు . జనాలు కూడా కథలు పెద్ద గా పట్టించు కోకుండా యాక్షన్ సన్నివేశాలు , పాటలు , డైలాగులు బాగుం టే సినిమాలను చూడడానికి ఇష్టపడు తూ ఉండేవారు.
దానితో యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లకు , కమర్షియల్ సినిమాలకు ఎక్కువ కలెక్షన్లు వస్తూ ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారాయి. యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లు అయిన , కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లు అయినా కథ ఎంతో కొంత శాతం డిఫరెంట్ గా ఉంటేనే ప్రేక్షకులు ఆ సినిమాలను థియేటర్లకు వెళ్లి మరీ చూడడానికి ఇష్టపడుతున్నారు. లేదంటే సినిమాలను ఓ టీ టీ లోకి వచ్చాక చూద్దాం అనే భావనను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దానితో ఈ మధ్య కాలంలో కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లు సక్సెస్ అయిన దాఖలాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు అయిన సరే డిఫరెంట్ కథాంశంతో రూపొందితే ఆ సినిమాలను థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిని ఎక్కువగా చూపిస్తున్నారు.
దానితో ఈ మధ్య కాలంలోనే అనేక తక్కువ బడ్జెట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. దానితో నిర్మాతలు కూడా చిన్న సినిమాలు అయిన సరే డిఫరెంట్ కథ ఉంటే నిర్మించడానికి రెడీ అవుతున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలనే చూడడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు.