'క' సినిమాలో.. చూపించిన ఆ ఊరు నిజంగానే ఉంది.. ఎక్కడ తెలుసా?
సినిమాకి అవసరమైతే ఏకంగా సముద్రాలను కూడా టెక్నాలజీని ఉపయోగించుకుని తయారు చేస్తూ ఉంటారు. ఇంకొన్నిసార్లు ఏకంగా ఊరు ఫీల్ రావడానికి పెద్దగా సెట్స్ వేయడం కూడా చూస్తూ ఉంటాం. అందుకే సినిమాలో కనిపించింది నిజమా అబద్దమా అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. దాదాపుగా సినిమాలో చూపించినవన్నీ కూడా అబద్ధాలు అని కేవలం కల్పితాలు మాత్రమే అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన 'క'మూవీలో కూడా కొదురుపాక అనే ఒక విలేజ్ ని చూపిస్తారు. అయితే ఇలాంటి విలేజ్ నిజజీవితంలో ఉండదని కేవలం సినిమా కోసం మాత్రమే ఇది క్రియేట్ చేసి ఉంటారని అందరూ అనుకున్నారు.
అయితే ఆ ఊరిలో కేవలం మూడు గంటలకే చీకటి పడిపోతుంది అంటూ సినిమాలో చూపించారు. అయితే క సినిమాలో చూపించిన ఊరు నిజంగానే ఉంది. తెలంగాణలోని పెద్దపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూడు జాముల కొదురుపాక అనే ఊరిలో ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు జాములే ఉంటాయి. సాయంత్రం నాలుగు గంటలకే అక్కడ చీకటి అవుతుంది. నాలుగు దిక్కుల ఎత్తయిన కొండలు ఉండి మధ్యలో ఊరు ఉండడంతో సూర్యుడు ఆ కొండల చాటుకు వెళ్లడంతో నీడపడి ఇక నాలుగు గంటలకే చీకటి అయిపోతుంది. అయితే ఈ విషయం తెలిసి ఇప్పుడు అభిమానులు అందరూ కూడా షాక్ అవుతున్నారు.