బాలయ్య వల్ల ఆ హీరోతో సినిమానే వద్దనుకున్న దర్శకుడు.. కానీ ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పటివరకు ఎన్నో ఇండస్ట్రీ హిట్ మూవీలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే బాలయ్యకు అద్భుతమైన విజయాలు అందించిన దర్శకులలో బి గోపాల్ ఒకరు. బాలకృష్ణ హీరోగా రూపొందిన లారీ డ్రైవర్ , రౌడీ ఇన్స్పెక్టర్ , సమర సింహా రెడ్డి , నరసింహ నాయుడు , పలనాటి బ్రహ్మనాయుడు అనే సినిమాలకు గోపాల్ దర్శకత్వం వహించాడు. ఇందులో లారీ డ్రైవర్ , రౌడీ ఇన్స్పెక్టర్ మూవీలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోగా , సమర సింహా రెడ్డి , నరసింహ నాయుడు ఇండస్ట్రీ హిట్లను అందుకున్నాయి. పలనాటి బ్రహ్మనాయుడు సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇది ఇలా ఉంటే గోపాల్ , బాలకృష్ణ హీరోగా సమర సింహా రెడ్డి , నరసింహ నాయుడు అనే సినిమాలను ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందించాడు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా గోపాల్ దర్శకత్వంలో అశ్వినీ దత్ ఓ మూవీని సెట్ చేశాడట. ఇక చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథతో సినిమా చేయమని ఆయనకు ఆఫర్ వచ్చిందట. దానితో చిన్న కృష్ణ దగ్గర ఉన్న కథను మొత్తాన్ని గోపాల్ విన్నాడట. కథ మొత్తం విన్న తర్వాత చిరంజీవితో ఆ కథతో అస్సలు సినిమా చేయద్దు అనుకున్నాడట. ఆ తర్వాత ఒక రోజు పరుచూరి గోపాలకృష్ణ నువ్వు ఎందుకు ఆ కథతో సినిమా చేయను అంటున్నావు అని అడిగాడట. దానితో ఆయన నేను ఇప్పటికే బాలకృష్ణతో సమర సింహా రెడ్డి , నరసింహ నాయుడు అనే రెండు ఫ్యాక్షన్ సినిమాలు చేశాను.

మరోసారి అలాంటి కథనే సినిమా చేస్తే వర్కౌట్ అవుతుందో ... కాదో అందుకే నేను చిరంజీవితో ఆ కథతో సినిమా చేయను అన్నాడట. దానితో ఆయన నువ్వు బాలకృష్ణ తో చేసావ్ చిరంజీవితో కాదు. ఈ కథతో చిరంజీవితో సినిమా చెయ్ మంచి విజయం అందుకుంటుంది అన్నాడట. ఆయన మాటలకు కన్విన్స్ అయ్యి గోపాల్ , చిరంజీవితో సినిమా చేశాడట. ఆ మూవీనే ఇంద్ర. ఇక ఇంద్ర సినిమా ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: