Sr.ఎన్టీఆర్ కి సావిత్రితో ఎఫైర్ అంటగట్టిన జనాలు.. కానీ ఆయన చేసిన పనికి ఇండస్ట్రీ షాక్.?

Pandrala Sravanthi
దివంగత లెజెండరీ నటినటులు అయినటువంటి సీనియర్ ఎన్టీఆర్,సావిత్రి కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ అనే టాక్ అప్పట్లో ఉండేది.అయితే ఇప్పటి హీరో హీరోయిన్ల కాంబో ఎక్కువసార్లు రిపీట్ అయి హిట్టు పడుతుందో లేదో తెలియదు. కానీ అప్పట్లో ఒకరి కాంబోలో సినిమా వచ్చి హిట్ అయితే మళ్లీ వారి కాంబోలో సినిమా తీస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. అలా సీనియర్ ఎన్టీఆర్ కూడా ఒక హీరోయిన్ తో పది,20,30 సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అప్పట్లో హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉండేది కాబట్టి ఒకే హీరోయిన్ తో 30,40 సినిమాలు చేసేవారు.అలాగే ఇప్పుడైతే ఒక సినిమా చేయడానికి మూడు నాలుగు సంవత్సరాలు తీసుకుంటున్నారు.కానీ అప్పట్లో ఒక ఏడాదిలో  ఒక హీరో 10,15 సినిమాల్లో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే..ఇప్పుడు ఎలా అయితే హీరో హీరోయిన్లు కలిసి ఎక్కువ సినిమాలు నటిస్తే ఎఫైర్ వార్తలు వినిపిస్తున్నాయో అప్పటి తరంలో కూడా ఎఫైర్ వార్తలు వినిపించాయి.

అలా సీనియర్ ఎన్టీఆర్ సావిత్రి కాంబినేషన్లో ఎక్కువ సినిమాలు రావడంతో సీనియర్ ఎన్టీఆర్ కి సావిత్రికి మధ్య ఏదో నడుస్తోంది అనే టాక్ మీడియాలో వైరల్ అయింది. అయితే అప్పట్లో సోషల్ మీడియా అందుబాటులో లేకపోయినప్పటికీ వార్తాపత్రికల ద్వారా ఇలాంటి వార్తలు ఎక్కువగా కనిపించేవి. ముఖ్యంగా చాలామంది సినీ జర్నలిస్టులు హీరో హీరోయిన్లు డైరెక్టర్లు చేసే ప్రతి ఒక్క పనిని దగ్గరుండి మరీ గమనించి పేపర్లలో అచ్చు వేయించేవారు.అలా ఎంతోమంది సీనియర్ నటినటుల గురించి వార్తాపత్రికల్లో చెడు వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే అలాంటిదే ఒక వార్త అప్పట్లో వైరల్ అయింది. సావిత్రి కి సీనియర్ ఎన్టీఆర్ కి మధ్య ఎఫైర్ వార్తలు అంట గట్టేసారట. అయితే ఎఫైర్ వార్తలపై సావిత్రిగానీ సీనియర్ ఎన్టీఆర్ గానీ స్పందించలేదు.

అయితే ఎన్నిసార్లు చెప్పినా ఈ వార్తలు ఆగవు అని సీనియర్ ఎన్టీఆర్ కి తెలుసు.దాంతో ఆయన చేసిన పనికి ఇండస్ట్రీ మొత్తం షాక్ అయిపోయింది. అదేంటంటే..సీనియర్ ఎన్టీఆర్ ఒక కొత్త ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం చేసిన సమయంలో సావిత్రి గారితో పాలు పొంగించుకున్నారట. అంటే సావిత్రి గారిని తన సొంత చెల్లెలిలాగా సీనియర్ ఎన్టీఆర్ గారు భావించారు. అలా తన గృహప్రవేశ సమయంలో చెల్లెలితో పాలు పొంగించుకుంటారు కాబట్టి సావిత్రిని చెల్లెలు గానే భావించి తనని కొత్త ఇంట్లో పాలు పొంగిచమని చెప్పారట. ఇక ఈ విషయం తెలియడంతోనే ఒక్కసారిగా ఇండస్ట్రీ షాక్ అయిపోయింది.అంతేకాదు వీరిద్దరి మధ్య అన్నాచెల్లెళ్ల బంధం ఉంది అని అందరికీ అర్థం అయిపోయింది.అలా ఒకే ఒక్క పని చేసి సీనియర్ ఎన్టీఆర్ అందరి నోర్లు మూయించారట

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: