రామయ్య వస్తావయ్యా: Jr.ఎన్టీఆర్ ని నిండా ముంచిన శృతిహాసన్..?

Pandrala Sravanthi
- హిట్ అవ్వాల్సిన సినిమా ఫ్లాప్..
- శృతిహాసన్ డ్రెస్సింగ్ పై విమర్శలు..
- హరీష్ శంకర్ హ్యాట్రిక్ ఆశలు గల్లంతు..

 జూనియర్ ఎన్టీఆర్,శృతిహాసన్, సమంత కాంబినేషన్లో వచ్చిన రామయ్యా వస్తావయ్యా సినిమా అందరూ చూసే ఉంటారు.. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఎన్నో కారణాలు తెరమీద వినిపించాయి.అందులో కొన్ని కారణాలు ఇప్పుడు చూద్దాం..
 శృతిహాసన్ డ్రెస్సింగ్ పై విమర్శలు:

ఎన్టీఆర్, సమంత,శృతిహాసన్ కాంబినేషన్లో హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన రామయ్యా వస్తావయ్యా మూవీ 2013లో భారీ అంచనాల మధ్య ప్రేక్షకులు ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా కంటే ముందే హరీష్ శంకర్ మిరపకాయ్,గబ్బర్ సింగ్ వంటి రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించారు. ఇక ఈయన డైరెక్షన్లో వచ్చే మూడో సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.అలాగే హరీష్ శంకర్ కూడా హ్యాట్రిక్ హిట్ కొట్టాలి అనే ఉద్దేశంతో ఈ సినిమాని ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కించాడు. అంతేకాకుండా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించడం తో అందరికీ అంచనాలు పెరిగిపోయాయి. కానీ తీరా సినిమా ఫలితం చూస్తే డిజాస్టర్.. అయితే ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ లో హరీష్ శంకర్ మాట్లాడుతూ..ఈ సినిమా ఫస్టాఫ్ బాగానే ఉంటుంది.

కానీ ముందే మెయిన్ విలన్ చనిపోవడంతో సెకండ్ హాఫ్ లో కథ ఏముంటుంది అని ప్రేక్షకులు నిరాశపడ్డారు.దీంతో సినిమా ఫ్లాప్ అయింది. అయితే నేను కూడా స్క్రీన్ ప్లే అంతగా సరిచూసుకోలేదు.ఇక ఈ సినిమా ఫ్లాప్ బాధ్యత మొత్తం నేనే తీసుకుంటాను అంటూ హరీష్ శంకర్ తెలియజేశారు. అయితే హరీష్ శంకర్ మాత్రమే కాదు ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన శృతిహాసన్ డ్రెస్సింగ్ పై కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సిటీ నుండి పల్లెటూరికి వచ్చిన అమ్మాయి పల్లెటూర్లో ఉన్న వారికి చదువు చెప్పడం వంటివి చేసే సమయంలో ఆమె డ్రెస్సింగ్ స్టైల్ అసలు బాగాలేదని,జీన్స్ లు వేసుకొని ఆమె ఈ సినిమాలో కనిపించడం చాలామందికి నచ్చలేదు. దాంతో ఈ సినిమాలో శృతిహాసన్ డ్రెస్సింగ్ స్టైల్ పై ఎన్నో విమర్శలు చేశారు. అలా సినిమా ఫ్లాప్ కి శృతిహాసన్ కూడా కారణమైంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: