మెగా డాటర్స్ అందరికి ఆ హీరోయిన్ అంటే మంట..కనిపిస్తే కోపంతో ఊగిపోతారు..ఎందుకు..?

Thota Jaya Madhuri
మెగా ఫ్యామిలీ మెంబర్స్ కి సురేఖ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  కేవలం తన కూతుర్లనే కాదు నిహారికను అదే విధంగా పవన్ కళ్యాణ్ కూతురుని కూడా తన కూతుర్లు గానే భావిస్తూ ఉంటుంది సురేఖ . ఆ మాటకు వస్తే మెగా ఫ్యామిలీలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా తన బిడ్డ లాగే ట్రీట్ చేస్తూ ఉంటుంది . ఎవరిపైన కోప్పడదు అందర్నీ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తూ చాలా బాగా మాట్లాడుతుంది. అందుకే సురేఖ అంటే అందరికీ చాలా ఇష్టం .


అందరూ ఆమెను "అమ్మ" అనే పిలుస్తూ ఉంటారు. కాగా అటువంటి సురేఖను ఓ స్టార్ హీరో భార్య..ఆమె కూడా ఓ హీరోయిన్ నే.. ఓ బిగ్ ఫంక్షన్ లో అవమానించడంతో అప్పటినుంచి ఆ స్టార్ హీరో భార్య అంటే ప్రతి ఒక్క మెగా ఫ్యామిలీ మెంబర్ కి బాగా కోపం వచ్చేస్తుంది. అంతే కాదు రామ్ చరణ్ అయితే ఏకంగా ఆ స్టార్ హీరోతో కూడా నటించడమే మానేశారు . అంతా కోపం పెంచేసుకున్నారు ఆ స్టార్ హీరో భార్యపై మెగా ఫ్యామిలీ.  మనకు తెలిసిందే సురేఖ చాలా మంచి మనిషి .


అయితే ఒకనాడు ఒక ఫంక్షన్ కి చిరంజీవి - సురేఖా ను కలిసి ఆ జంటగా హాజరవ్వగా అందరూ లేడీస్ అక్కడ ఉన్న ఆ హీరోయిన్ ని వదిలేసి.. చిరంజీవి భార్య ని పలకరించడం మొదలు పెట్టారు. దీంతో ఈర్ష్యతో ఆ హీరోయిన్..చిరంజీవి భార్యను తక్కువగా చేసి మాట్లాడిందట . "చిరంజీవి స్టార్ స్టేటస్ తో ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటుందని .అసలు ఈమెకి చిరంజీవి భార్య అయ్యే అర్హత లేకుండా ఉండుంటే ఈమె పొజిషన్ వేరేలా ఉండేది అని.. చాలా నీచంగా మాట్లాడిందట ".

 
అయితే అప్పుడే స్టేజిపై చిరంజీవి నేను ఇంత స్థాయిలో ఉండడానికి కారణం నా భార్య సురేఖ అని చెప్పడం తో ఆమె నోరు మూత పడ్డింది . అదేవిధంగా అక్కడ చప్పట్లు వర్షం కురిసింది. అయితే మెగా ఫ్యామిలీ మాత్రం ఆ చేదు జ్ఞాపకాన్ని ఇప్పటికీ మర్చిపోలేదట . ఆ స్టార్ హీరో భార్య అంటే మెగా ఫ్యామిలీకి మొత్తం కోపం.  ఎంతలా అంటే రామ్ చరణ్ కు ఆ హీరోయిన్  తల్లిగా నటించాల్సి ఉండగా ఆమె రోల్ నే సినిమా నుంచి పీకించేసాడట..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: