బాలకృష్ణ అన్నీ తానై చేయాలనుకున్న జానపద చిత్రం ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలకృష్ణ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అద్భుతమైన విజయాలను ఎన్నింటినో అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని హీరోగా కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే బాలకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం స్వీయ దర్శకత్వంలో తన నిర్మాణ సంస్థ అయినటువంటి బ్రహ్మతేజ పథకం పై ఓ జానపదా చిత్రాన్ని నిర్మించాలి అనుకున్నాడు. అందులో భాగంగా 1999 మే లో ఈ సినిమాను మొదలు పెడతాము అని బాలకృష్ణ అధికారికంగా ప్రకటించాడు.

దానితో బాలయ్య స్వీయ దర్శకత్వంలో తానే హీరోగా తన నిర్మాణ సంస్థలో జానపద చిత్రాన్ని మొదలు పెడతాడు అని , ఆ సినిమా చాలా త్వరగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని బాలయ్య అభిమానులు ఎంతో ఆశపడ్డారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. ఇకపోతే ఈ సినిమా సమయం లోనే బాలకృష్ణ , బి గోపాల్ దర్శకత్వంలో సమర సింహా రెడ్డి అనే సినిమా చేశాడు. ఇక ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయ్యి అద్భుతమైన కలక్షన్లను వసూలు చేసి అప్పటివరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని వసూళ్లను రాబట్టి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇక ఈ సినిమాలోని బాలకృష్ణ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. అలా జానపద చిత్రంతో తమ హీరో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ కొడతాడు అని అనుకున్న బాలయ్య అభిమానులకు ఆ సినిమా రాకపోయినా దాదాపు ఆ సమయంలో వచ్చిన సమర సింహా రెడ్డి మూవీ మాత్రం ఇండస్ట్రీ హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: