ఇండియా కోసం ప్రాణమిచ్చిన జవాన్ కథే ‘అమరన్’.. ఎవరీ ముకుంద్ వరదరాజన్.. ?
శివ కార్తికేయన్ ఈ హీరో ప్రతి ఒక్కరికి సుపరిచితమే. కోలీవుడ్ లోనే స్టార్ హీరో. తెలుగులోనూ తన సినిమాలతో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అలాంటి ఇతడు అడవి శేషు మేజర్ సినిమా తరహాలోనే మేజర్ ముకుంద్ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది సాయి పల్లవి. ఈ సినిమాలో సాయి పల్లవి తన అద్భుతమైన తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
దీపావళి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేశారు. అమరన్ సినిమాలో శివ కార్తికేయన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. శివ అరూర్, రాహుల్ సింగ్ రచించిన ఇండియాస్ మోస్ట్ ఫియర్ లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్ అనే పుస్తక సిరీస్ లోని మేజర్ వరదరాజన్ చాప్టర్ ఆధారంగా ఈ సినిమాను తీశారు.
మేజర్ ముకుంద్ భారత సైన్యంలోని రాజ్ పుత్ రెజిమెంట్ లో పనిచేశాడు. ఆయన అశోక చక్ర అవార్డు గ్రహీత. జమ్మూ కాశ్మీర్ లోని 44వ రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్ కు డిప్యూటేషన్ లో ఉన్నప్పుడు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ సమయంలో మేజర్ ముకుంద్ వరదరాజన్ సాహసోపేత చర్యలకు ఆయన మరణానంతరం అశోక చక్రం ప్రధానం చేశారు.
అనంతరం అక్టోబర్ 18, 2012లో రాష్ట్రీయ రైఫిల్స్ 44వ బెటాలియన్ కు మేజర్ గా ముకుంద్ వరదరాజన్ నియమింపబడ్డారు. ఆ తర్వాత డిసెంబర్ లో జమ్మూ కాశ్మీర్ లోని పోపియాన్ జిల్లాలలో తన సేవలు అందించారు. 2014 ఏప్రిల్ 25న ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను చంపేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ఆపరేషన్ కు నాయకత్వం వహించారు ముకుంద్. అయితే.. ఈ ఆపరేషన్ లో ముకుంద్ వరదరాజన్ సక్సెస్ అయ్యారు. ఇలా ఆయన పేరు పాపులర్ అయింది. ఇక ఇప్పుడు ఆయన స్టోరీనే సినిమాగా తీశారు.