తెలుగు సినీ పరిశ్రమలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన నటి అనుష్క శెట్టి. తన అందం, నటన, వైవిధ్యమైన పాత్రలతో ఆమె తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఆమె నటించిన సినిమాలు తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచాయి. చిన్నప్పటి నుండి నటనపై ఆసక్తి కలిగి ఉన్న ఆమె తన కెరీర్‌ను మోడలింగ్‌తో ప్రారంభించింది. తరువాత తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఆమె తొలి సినిమా సూపర్ అయితే తనకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ‘అరుంధతి’. ఈ సినిమాలో ఆమె చేసిన పాత్ర ఆమె కెరీర్ కు మలుపు తిప్పింది. ‘అరుంధతి’ తరువాత అనుష్క శెట్టి వరుస విజయాలను సాధించింది. ‘వేదం’, ‘విక్రమార్కుడు’, ‘సింగం’, ‘మిర్చి’, ‘బాహుబలి’ వంటి సినిమాలలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమాలోని దేవసేన పాత్ర ఆమె కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా నిలిచింది. అనుష్క శెట్టి తన కెరీర్లో వివిధ రకాల పాత్రలను చేసింది. క్లాసికల్ భామ నుండి ఆధునిక యువతి వరకు, గ్రామీణ మహిళ నుండి రాణి వరకు ఆమె అన్ని రకాల పాత్రలను సమర్థవంతంగా పోషించింది. ఆమె నటనలోని వైవిధ్యం ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇక ఈ క్రమంలోనే కొన్ని సినిమాల కోసం ఆమె విపరీతంగా బరువు పెరిగిపోయింది. దానివల్ల ఆమెకి అవకాశాలైతే రావడం లేదు. తను బరువు తగ్గడానికి ప్రయత్నం చేసినప్పటికి అది వర్కౌట్ కావడం లేదు.
దాంతో ఆమె కంటే ముందు వచ్చిన హీరోయిన్లు సైతం ఇప్పటికి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతుంటే ఆమె మాత్రం సినిమాల విషయంలో చాలావరకు వెనుకబడిపోయిందనే తెలుస్తుంది. బరువును తగ్గించుకొని మళ్ళీ స్లిమ్ గా తయారైతే చాలా మంచి అవకాశాలు తన కోసం ఎదురుచూస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఆమె సినిమాల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించనట్టుగా తెలుస్తోంది. అందువల్లే తన పని తను చేసుకుంటూ ముందుకెళ్తుంది తప్ప ప్రత్యేకించి కొన్ని క్యారెక్టర్ల కోసం బరువు తగ్గాల్సి వస్తే మాత్రం తగ్గలేకపోతుంది కారణం ఏదైనా కూడా తనకంటూ ఒక భారీ ఇమేజ్ ని సంపాదించుకున్న ఈ నటి ఇప్పుడు సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోవడంతో అభిమానులు చాలా వరకు డిసప్పాయింట్ అవుతున్నారు.