ఇండియన్ హిస్టరీలో అతిపెద్ద డిజాస్టర్ ' మార్టిన్ ' ... అర్జున్ ఎన్ని కోట్లకు ముంచాడంటే..?
- ఓవరాల్ గా కన్నడ ఇండస్ట్రీ పరువు తీసేసిన సినిమా
- సీనియర్ హీరో అర్జున్ దర్శకత్వ వైఫల్యం .. ?
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
ప్రస్తుతం ఇండియన్ సినిమాకు పాన్ ఇండియా క్రేజ్ పట్టుకుంది. అందులోనూ దాదాపు సౌత్ ఇండియా లో తెరకెక్కుతున్న అన్ని భారీ ప్రాజెక్టులను వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు అంటూ హడావుడి చేస్తూ రిలీజ్ చేస్తున్నారు. తెలుగుతో పాటు కన్నడంలో ఈ సంస్కృతి ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. .పెద్దగా పేరు లేని హీరోలు కూడా పాన్ ఇండియా అంటూ హడావుడి చేస్తున్నారు. . .ఈ క్రమంలోని ఇటీవల కాలంలో ఓ కన్నడ సినిమా పాన్ ఇండియా అంటూ హడావుడితో ప్రేక్షకుల ముందుకు వచ్చి బొక్క బోర్లా పడింది. నిర్మాతలకు ... డిస్ట్రిబ్యూటర్లకు అటు ఈ సినిమా కొన్న ప్రతి ఒక్కరికి భారీ నష్టాలు మిగిలింది. కన్నడ హీరో ధ్రువ సర్జ నటించిన ఈ రీసెంట్ మూవీ మార్టిన్.
భారీ బడ్జెట్ తో భారీ క్యాస్టింగ్ తో రావడంతో ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేశారు. సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఏమాత్రం లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడింది. సీనియర్ హీరో అర్జున్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అర్జున్ సినిమా కొన్న అందరిని నిట్ట నిలువునా ముంచేశారు. ఈ సినిమాను పలు భాషలలో రిలీజ్ చేయగా సినిమా రిలీజ్ అయిన అన్నిచోట్ల నెగిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఓవరాల్ గా మార్టిన్ సినిమా ఏకంగా 70 శాతానికి పైగా నష్టాలు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. ఇండియన్ హిస్టరీలోనే అతిపెద్ద డిజాస్టర్ సినిమాలలో మార్టిన్ ఒకటి.. అని ఇండియన్ ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి.