టైం ట్రావెల్ కథలకు మార్గం చూపిన కల్ట్ క్లాసిక్ మూవీ..!!

murali krishna
నందమూరి నటసింహం బాలయ్య తన 50 సంవత్సరాల సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పించారు.. తెలుగు సినీ చరిత్రలో బాలయ్య నుండి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి..అయితే బాలయ్య కెరీర్ లో అత్యద్భుతమైన చిత్రం “ ఆదిత్య 369”..ఈ సినిమా బాలయ్య కెరీర్ లో ఎంతో స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది..స్టార్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన అద్భుతమైన కళాఖండం “ఆదిత్య 369”..ఈ సినిమాతో తెలుగు సినీ చరిత్రలో దర్శకుడు సింగీతం మొట్ట మొదటి సారి టైం ట్రావెల్ కథను పరిచయం చేసారు.. అప్పటివరకు చూడని అద్భుతాన్ని తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాతో కనులారా చూసారు..అసలు ఆదిత్య369 సినిమా ఎలా మొదలైందో తెలుసుకుందాం..


ఒక విమాన ప్రయాణంలో ఎస్పిబి బాలసుబ్రమణ్యం గారు, సింగీతం శ్రీనివాసరావు గారు ఇరువురు పక్క పక్క సీట్లలో కూర్చొని ప్రయాణిస్తుండగా.. సింగీతం వారు ఆదిత్య 369 కథను వినిపించారు.. ఆ కథ విన్నాక ఆశ్చర్యపోయిన బాలు గారు..నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ని కలవమని సలహా ఇచ్చారు..అలా ఈ సినిమా ముందుకు సాగడానికి బాలు గారు సాయపడ్డారు..
ఈ సినిమాలో కృష్ణ కుమార్ పాత్ర, శ్రీకృష్ణ దేవరాయ పాత్రలలో బాలయ్య అద్భుతంగా నటించారు.. అయితే ముందుగా కృష్ణ కుమార్ పాత్రలో కమలహాసన్ ని తీసుకోవాలని మేకర్స్ భావించారు. శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో కచ్చితంగా బాలయ్యనే తీసుకోవాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. అలా ఓ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ తెరకెక్కించాలని మేకర్స్ భావించారు..

కానీ కమల్ హాసన్ అప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో రెండు పాత్రలలో బాలయ్యే నటించారు.. సినిమా అవుట్ పుట్ చూసాక రెండు పాత్రలలో బాలయ్య నటన అద్భుతంగా నటించారు.. ఈ సినిమాని సింగీతం వారు..హెచ్ జీ వెల్స్ రాసిన ‘ది టైం మిషన్’ అనే నవల ఆధారంగా తెరకెక్కించారు..టైం ట్రావెల్ కథకు చారిత్రికత జోడించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు..గ్రాఫిక్స్ అంతగా అభివృద్ధి చెందని సమయంలోనే సింగీతం గారు ఆదిత్య 369 సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.. ఇళయరాజా అందించిన సాంగ్స్ ఇప్పటికీ ఎంతో పాపులర్ అని చెప్పొచ్చు..మొత్తానికి బాలయ్య కెరీర్ లో ఆదిత్య 369 సినిమా ఎవర్గ్రీన్ మూవీగా నిలిచిపోయింది.. త్వరలోనే ఈ ఎవర్గ్రీన్ మూవీకి సీక్వెల్ తెరకెక్కించే ఆలోచనలో బాలయ్య ఉన్నట్లు సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: