సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం..అన్ని జరుగుతాయా ఏంటి..!
కాగా ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు . ఈ ఈవెంట్ లో బాగా మాట్లాడాడు కిరణ్. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఒక పెద్ద ఆఫీస్ కి సంబంధించిన వాళ్ళు వాళ్ల సినిమాలో కిరణ్ అబ్బవరం ను ట్రోల్ చేశారు అని ..దారుణంగా కామెడీ సీన్స్ తో వక్రీకరిస్తూ ఆయనను ఇబ్బంది కలగజేసే విధంగా తెరకెక్కించారు అని స్టేజి పైన ఓపెన్ గా చెప్పుకొచ్చాడు కిరణ్ అబ్బవరం . నాగచైతన్య కూడా సపోర్ట్ చేయడం హైలేట్ గా మారింది. అయితే సినిమా పబ్లిసిటీ మొత్తం ఇక్కడే స్టార్ట్ అయింది . ఆయన అలా స్టేజిపై మాట్లాడడంతో కిరణ్ అబ్బవరం "క" సినిమా చాలా చాలా హ్యూజ్ బజ్ క్రియేట్ చేసుకున్నింది.
అసలు "క" సినిమా గురించి తెలియని వాళ్ళు కూడా "క" సినిమా అంటే ఏంటి..? అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు . కిరణ్ అబ్బవరం మాట్లాడిన మాటలు సినిమాకి బాగా ప్లస్ గానే మారి హిట్టు అందుతుంది అంటూ అంతా భావించారు. సీన్ కట్ చేస్తే కొద్ది సేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా నెగిటివ్ టాక్ సంపాదించుకుంది. అంతేకాదు కిరణ్ అబ్బవరం మాట్లాడిన అంత హైలెట్గా సినిమా ఏమీ లేదు అని ..ఒకటి రెండు సీన్స్ మినహా మిగతా అంతా కూడా చాలా చాలా సినిమాల్లో ఉండే విధంగానే ఉంది అని ..మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మొత్తం కాంతారా సినిమాను కాపీ కొట్టినట్లు ఉందన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాదు కొంతమంది కావాలని తన సినిమా పబ్లిసిటీ కోసం జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ని టార్గెట్ చేశాడు కిరణ్ అంటున్నారు. అయితే ఆయన అనుకున్నట్లు జరగలేదు అని.. సినిమా బెడిసికొట్టింది అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది బాలకృష్ణ డైలాగ్ ను కూడా అప్లై చేస్తున్నారు . "సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని వర్క్ అవుట్ అవుతాయా ఏంటి ..?"అంటూ దారుణాతి దారుణంగా కిరణ్ అబ్బవరంని ట్రోల్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు కిరణ్ అబ్బవరం "క" సినమాకు సంబంధించిన టాక్ వైరల్ గా మారింది..!