మామ‌గారు : ఇయ్యాలే అచ్చమైన దీపావళి...నిత్యమైన దీపావళి ?

Veldandi Saikiran
* వినోద్ కుమార్ - య‌మున జంట‌గా మామ‌గారు
* దాసరి నారాయణరావు నటుడిగా విశ్వరూపం
* 1991 ఆగస్ట్‌ 30న రిలీజ్‌
* మామ‌గారు సినిమాలో దీపావ‌ళి సాంగ్ అదుర్స్‌

దర్శకరత్న దాసరి నారాయణరావు నటునిగా తన విశ్వరూపం చూపించిన సినిమా 'మామగారు'. తమిళ చిత్రం "నాన్ పుడిచ మాపిల్లై"ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. రీమేక్ సినిమాలను రూపొందించడంలో మేటి అనిపించుకున్న ఎడిటర్ మోహన్ ఈ సినిమాను ఎం ఎం మూవీ ఆర్ట్స్ పతాకంపై నిర్మించారు. ముత్యాల సుబ్బయ్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
అనంతరం మరో ఐదేళ్లకు ఎడిటర్ మోహన్ నిర్మించిన రీమేక్ "హిట్లర్" లోను దాసరి నారాయణరావు కీలక పాత్ర పోషించారు. ఎడిటర్ మోహన్ నిర్మించిన మరో సినిమా "శుభమస్తు"లోనూ దాసరి నటించిన జరిగింది. నటునిగా ఈ చిత్రాలు దాసరికి మంచి పేరు, గుర్తింపును సంపాదించి పెట్టాయి. మామగారు సినిమాలో ఉత్తమ నటునిగా దాసరి నారాయణరావుకి నంది అవార్డులు రావడం విశేషం. 1991 ఆగస్టు 30న విడుదలైన "మామగారు" సినిమా బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిందని చెప్పవచ్చు.
సత్తెయ్యగా దాసరి నారాయణ రావు నటించిన ఈ సినిమాలో వినోద్ కుమార్, యమున, అన్నపూర్ణ, ఐశ్వర్య, పాకీజా, నిర్మలమ్మ, కోటా శ్రీనివాసరావు, మోహన్ బాబులు కీలకపాత్రలను పోషించారు. ఇదిలా ఉండగా...  దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన మామగారు సినిమాలో "ఇయ్యాలే అచ్చమైన దీపావళి వెయ్యేళ్లు నిత్యమైన దీపావళి" అంటూ ఓ పాట వస్తోంది.

దీపావళి పండుగను వేడుకగా జరుపుకుంటున్నట్లు చూపించిన ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయడం జరిగింది. రాజ్ కోటి సంగీతాన్ని అందించారు. ఈ పాటను బాలు, స్వర్ణలత పాడారు. ఈ సాంగ్‌ అప్పట్లో మంచి పాపులారిటీ దక్కించుకుంది. అలాగే..ఈ ఒక్క పాటలో.. దీపావళి పండుగను కళ్లకు కట్టినట్టుగా చూపించారు. కాగా, ఈ సినిమా సక్సెస్ కావడంతో ఉత్తమ నటునిగా దాసరి నారాయణరావుకి, ఉత్తమ సహాయ నటునిగా వినోద్ కుమార్ కు, ఉత్తమ హాస్య నటునిగా బాబు మోహన్ కు నంది అవార్డులు వచ్చాయి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: