అమ్మ "మీనాక్షి" ఏంటి మాకు ఈ పరిస్ధితి..!
అఫ్కోర్స్ ఈ సినిమా ఫ్లాప్ అయింది . అయినా కూడా మీనాక్షి చౌదరికి మంచి ఆఫర్లు దక్కాయి . మరి ముఖ్యంగా కోలీవుడ్ లో మూడు తెలుగులో రెండు సినిమాలతో బిజీ బిజీగా ముందుకెళ్తుంది ఈ బ్యూటి. రీసెంట్గా ఆమె నటించిన లక్కీ భాస్కర్ సినిమా కూడా రిలీజ్ అయింది . ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది . లక్కీ భాస్కర్ సినిమాలో మీనాక్షి పాత్ర కూడా హైలెట్గా మారింది. అయితే సడన్ గా ఈమె పెళ్లి వార్త తెరపైకి వచ్చింది.
మీనాక్షి చౌదరి త్వరలోనే కోలీవుడ్ బడా స్టార్ ఇంటికి కోడలు కాబోతుంది అన్న వార్త హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది . గతకొద్దికాలంగా మీనాక్షి చౌదరి ఒక అబ్బాయి తో డేటింగ్ చేస్తుంది అంటూ ప్రచారం జరిగింది . అయితే ఆయన మరెవరో కాదని ఓ స్టార్ అంటూ తెలుస్తుంది. మీనాక్షి చౌదరి ప్రేమించింది కోలీవుడ్ సీనియర్ హీరో కొడుకుని అంటూ ఓ న్యుస్ బాగా ట్రెండ్ అవుతుంది. వీళ్ళ పెళ్లికి కూడా పెద్ద లు అంగీకరించారట .
ఇద్దరు కెరియర్ లో సెటిల్ అయ్యాక వీళ్ల పెళ్లి చేయాలి అంటూ డిసైడ్ అయ్యారట . అయితే కుర్రాళ్లకు ఇప్పుడు అర్థం కాని పరిస్థితి నెలకొంది . అసలు నువ్వు స్టార్ హీరోయిన్గా మారలేదు ..పక్కగా చెప్పాలంటే ఒక్క బ్లాక్ బస్టర్ కూడా నీ ఖాతాలో పడలేదు . అప్పుడే ప్రేమ - పెళ్లి ఏంటి..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మీనాక్షి చౌదరి తీసుకున్న నిర్ణయం అర్థం కావడం లేదు అంటూ మాట్లాడుకుంటున్నారు . అసలు మీనాక్షి చౌదరి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ గజిబిజి ప్రశ్నలతో సోషల్ మీడియాలో హాట్ హాట్ గా మీనాక్షి చౌదరి పేరును ట్రోల్ చేస్తున్నారు . దీనిపై మీనాక్షి చౌదరి ఎలా స్పందిస్తుందో చూడాలి..?