'ఆరుగురు పతివ్రతలు' బ్యూటీ గుర్తుందా.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
చిత్ర పరిశ్రమలో హీరోల సంగతి పక్కన పెడితే, హీరోయిన్స్ కెరీర్ చాలా క్లిష్టంగా ఉంటుంది. హీరోలకు ఇక్కడ ఎటువంటి డోకా ఉండదు. ఒక్కసారి స్టార్ అయినవారు చచ్చేదాకా ఆ స్టార్ డంని అనుభవిస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ల పరిస్థితి అలా కాదు. స్టార్ గా ఓ రెండు మూడు సంవత్సరాలు బాగానే వెలుగొందుతారు, కానీ ఆ తరువాత సడెన్ గా కనుమరుగవుతుంటారు. ఎందుకంటే, ఆ ప్లేసుకోకి మరో హీరోయిన్ వస్తూ ఉంటుంది. అలాంటివారు ఎంతోమంది ఉన్నారు. ఇక మీకు 'ఆరుగురు పతివ్రతలు' అనే సినిమా గురించి తెలిసే ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం రిలీజైన ఈ సినిమా ఫామిలీ ఆడియన్సుని బాగానే ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా విశ్లేషకులు ఈ సినిమాని అప్పట్లో ఆకాశానికెత్తేశారు.
డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఈ చిత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది. కామెడీ సినిమాలకు ఈవీవీ కేరాఫ్ అడ్రస్ అయిన సంగతి విదితమే. అలాంటి డైరెక్టర్ ఇలాంటి ఓ ప్రయోగాత్మక సినిమా తీసి పెనుసంచలనం సృష్టించాడు. ఈ సినిమాతోనే ఫేమస్ హీరోయిన్ అయింది నటి అమృత. బేసిగ్గా కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఈ బ్యూటీని తెలుగు తెరకు పరిచయం చేశారు ఈవీవీ. ఈ చిత్రంలో ఆమె అందం, అభినయం ప్రేక్షకులను మెప్పించిందనే చెప్పుకోవాలి. 2004 ఫిబ్రవరి 6న రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని ఈవీవీ బ్యానర్ పై ఈవీవీ సత్యనారాయణ నిర్మించి, దర్శకత్వం వహించగా కాసుల వర్షం కురిపించింది.
ఇక అసలు విషయంలోకి వెళితే, ఈ సినిమాలోని అమృత పాత్రపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. అంతలా ఆమె పాత్రలో లీనమయ్యింది. ఆ తర్వాత ఆమె తెలుగులో కేవలం 8 చిత్రాల్లో మాత్రమే నటించింది. 2009లో 'జోడి నెంబర్ 1' లో నటించింది. అదేవిధంగా కన్నడలో వచ్చిన ఈ మూవీలోనే ఆమె చివరిసారిగా నటించింది. అమృత కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని, ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపించడం లేదు. దీంతో ఆమె ఎక్కడ ఉన్నారనే సంగతి మాత్రం ఎవ్వరికీ తెలియదు. అయితే ఆమె వివాహం అనంతరం విదేశాల్లో సెటిల్ అయినట్టు వినికిడి. ఇక ఈ సినిమాలో ఇందులో చలపతిరావు, ఎల్.బి.శ్రీరామ్, శ్రీకృష్ణ కౌశిక్ కీలకపాత్రలో పోషించగా.. కమలాకర్ సంగీతం అందించారు.