"ముచ్చటగా ముగ్గురు".. అల్లు ఫ్యామిలీలోకి న్యూ మెంబర్..ఫ్యాన్స్ కి ట్రిపుల్ గుడ్ న్యూస్..!?
శిరీష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాన్న బడా ప్రొడ్యూసర్ ..అన్న పాన్ ఇండియా హీరో ...కెరియర్ ఇంకా ఏ రేంజ్ లో దూసుకుపోతుందో అర్థం చేసుకోవచ్చు . అయితే అల్లు శిరీష్ మాత్రం ఎక్కడ తన తండ్రి తన అన్న పలుకుబడిన ఉపయోగించుకోకుండా సొంత టాలెంట్ తోనే పైకి రావాలి అనుకున్నాడు . అలాగే కథలను చూస్ చేసుకున్నాడు. వచ్చిన కథలలో కొన్ని హిట్ అయ్యాయి .కొన్ని ప్లాప్ అయ్యాయి. దీంతో అల్లు శిరీష్ పేరు ఉత్త శిరీష్ గానే మిగిలిపోయింది . దానికి ముందు ఏ ట్యాగ్స్ దక్కించుకోలేకపోయాడు. అయితే అల్లు శిరీష్ కు సంబంధించి ఒక వార్త ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతూనే ఉంటుంది.
అల్లు శిరీష్ పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపడు ఎందుకని..? పెళ్లి వయసు దాటిపోతుందిగా..?. అయితే చాలా సందర్భాలలో దీని పై స్పందించారు శిరీష్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది . త్వరలోనే అల్లు శిరీష్ పెళ్లి జరగబోతుందట . అల్లు ఇంట్లో ఫంక్షన్ జరగబోతుంది అంటూ జనాలు ఓ రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు . వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే అల్లు ఫ్యామిలీలో పెళ్లి భాజలు మోగిపోతున్నాయి . అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడు . అది కూడా తన క్లోజ్ ఫ్రెండ్ ని. ముంబైలో యాక్టింగ్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమెతో పరిచయం ఏర్పడిందట . ఆ పరిచయం కాస్త ఫ్రెండ్షిప్ ..ఫ్రెండ్షిప్ కాస్త లవ్ గా మారి ఇప్పుడు ఇంట్లో వాళ్ళను ఒప్పించి మరి పెళ్లి చేసుకోబోతున్నారట. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఇన్నాళ్లు అల్లు శిరీష్ ను పట్టించుకోవడం లేదు అల్లు అరవింద్ అంటూ తెగ ట్రోల్ చేశారు . అయితే అల్లు శిరీష్ పెళ్లి జరగబోతూ ఉండడంతో ఆయనను ట్రోల్ చేసిన వాళ్ల నోరు మూసుకోండి అంటూ అల్లు ఫాన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే దీని పై ఇప్పటి వరకు అల్లు ఫ్యామిలీ కానీ..శిరీష్ కానీ స్పందించలేదు..!