దళపతి విజయ్ గెలవడు... సీఎం కాడు... ఆ పార్టీని ఓడించడమే టార్గెట్...?
కమల్ ఎమ్మెల్యేగా గెలవలేని పరిస్థితి. ఎంపిగానే ఓడిపోయారు. ఇక అజిత్ రాజకీయాల వైపు చూసేందుకు ఆసక్తితో లేరు. ఈ నేపథ్యంలో విజయ్ రాజకీయ రణక్షేత్రంలోకి దిగేశారు. ఈ నేపథ్యంలో తొలి సభ తర్వాత విజయ విషయంలో రాజకీయ విశ్లేషకుల నుంచి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత విజయ్ రాజకీయంగా విజయం సాధిస్తారా.. గెలుస్తారా.. అన్నది పక్కన పెడితే డిఎంకెను దెబ్బ కొడతారని చర్చ నడుస్తోంది.
సంస్థాగతంగా విజయ్ పార్టీ బలోపేతం కావడానికి సరైన సమయం లేదని.. మాటతో పాటు తమిళనాడు సీఎంగా చేసే అంత ఉత్సాహం సామాన్య జనాల్లోనూ కనిపించడం లేదని తెలుస్తోంది. 2026 లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ ఆ ఎన్నికలతో తమిళనాడు బలమైన ప్రతిపక్షంగా నిలబడే అవకాశాలు ఉన్నాయన్న మాట మాత్రం ప్రముఖంగా వినిపిస్తోంది. జయలలిత రెండుసార్లు సీఎంగా గెలిచి ఆ హోదాలో మరణించారు. ఆ తర్వాత డిఎంకెకు అవకాశం వచ్చింది.
ఇప్పుడు స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అన్నాడీఎంకే తమిళనాడు రోజురోజుకు దిగజారుతోంది. ఈ క్రమంలో యాంటీ డీఎంకే ఓటర్ పూర్తిగా విజయ్‌వైపు మళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది. అన్నాడీఎంకే స్థానాన్ని విజయ్ పార్టీ ఆక్రమిస్తుందని అంటున్నారు. తమిళనాడు కమలం పార్టీకి అంత సీన్ లేదు. ఏది ఏమైనా విజయ్ గెలవకపోవచ్చు.. అలానే ముఖ్యమంత్రి కూడా కాడు. కానీ డీఎంకే పార్టీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తాడు అన్న ప్రచారం మాత్రం తమిళనాడు వినిపిస్తోంది.