తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉంటారు. వీరిద్దరూ స్టార్ హీరోలు అయినప్పటికీ ఎంతో మంచి స్నేహం తో కలిసి మెలిసి ఉంటారు. ఒకరిని ఒకరు బావ అను పిలుచుకుంటూ ఆప్యాయంగా మెలుగుతూ ఉంటారు. ఇకపోతే ఒకా నొక సందర్భంలో ఒక విషయం జూనియర్ ఎన్టీఆర్ కు పెద్దగా నచ్చలేదట. కానీ అల్లు అర్జున్ కు మాత్రం ఆ విషయం చాలా అద్భుతంగా నచ్చిందట. మరి అది ఏ విషయం అనుకుంటున్నారా .? అదేదో కాదు అది సినిమా విషయమే. అసలేం జరిగిందో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన కథ రచయితలలో వక్కంతం వంశీ ఒకరు. ఈయన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన సినిమాలకు , అల్లు అర్జున్ హీరోగా రూపొందిన సినిమాలకు కథలను అందించారు. ఈయన కథ రచయితగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా కెరీర్ను స్టార్ట్ చేయాలి అని అనుకున్నాడట. అలా అనుకున్న సమయంలో మొదటగా జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా తారక్ కి ఓ కథను కూడా వినిపించాడట. ఆ కథ విని ఆయన సైలెంట్ గా ఉండిపోయాడట. ఇక అనుకోకుండా అదే కథను అల్లు అర్జున్ కూడా విన్నాడట.
కథ సూపర్ గా ఉంది బ్లాక్ బాస్టర్ అని చెప్పాడట. ఆ తర్వాత తారక్ తో కూడా ఇదే విషయం చెబితే ఆయన సైలెంట్ అయ్యాడట. ఆ తర్వాత బన్నీ కి తారక్ ఆ కథను రిజెక్ట్ చేసినట్లు తెలిసిందిట. దానితో వెంటనే తారక్ రిజల్ట్ చేసిన పర్లేదు ఆ కథ నాకు బాగా నచ్చింది మీరు ఓకే అంటే నేను ఆ కథతో సినిమా చేస్తాను అని అన్నాడట. దానితో వంశీ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి సినిమాను రూపొందించాడట. మరి ఆ సినిమా ఏదో కాదు అదే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.