రజనీ సినిమాకి మరీ అంత తక్కువ కలెక్షన్లా? మార్కెట్ ఎటుపోయింది?
అవును, ఈ సినిమాలో అమితాబ్ ని మొదలుకొని, ఫహాద్ ఫాజిల్, రావు రమేష్ వంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులను నటింపజేసి, ప్యాన్ ఇండియా స్దాయిలో రిలీజ్ చేసినప్పటికీ ఫలితం మాత్రం దారుణంగా పడిపోయింది. ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ చూస్తే ఆ విషయం క్లారిటీ వస్తుంది. ఇలాంటి దారుణ పరిస్థితి బహుశా రజనీ సినిమా కెరీర్లోనే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ‘వేట్టయన్’ ప్రాంతాలవారీగా క్లోజింగ్ కలెక్షన్స్ పరిశీలిస్తే, తమిళనాడు (100 cr), కర్ణాటక (22 cr), ఆంద్రా/తెలంగాణా (21 cr), కేరళ (17 cr), రెస్టాఫ్ ఇండియా (7 cr), ఓవర్ సీస్ (80 cr), వరల్డ్ వైడ్ (247 cr) మాత్రమే కెలెక్షన్లు రాబట్టి డిజాస్టర్ గా నిలిచింది.
రజనీ సక్సెస్ ఫుల్ చిత్రం ‘జైలర్’ సినిమా తర్వాత ఆయన్నుంచి ఇటువంటి సినిమాని జనాలు అస్సలు ఉహించనేలేదు. దానికి తోడు ఈ సినిమాకి ‘జై భీమ్’ ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వం వహించడం కొసమెరుపు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా 325 కోట్లు జరిగింది. అయితే 76% మాత్రమే ప్రీ బజ్ వాల్యూలో రికవరీ అయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాంతో ఈ సినిమా భాక్సాఫీస్ దగ్గర ఫ్లాఫ్ గా నమోదు అయ్యింది. అదేవిధంగా ‘వేట్టయన్’ హిందీ ఆడియన్స్ ని కూడా ఇంప్రెస్ చేయలేకపోయింది. నార్త్ లో కేవలం ‘వేట్టయన్’చిత్రం 0.70 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. అమితాబ్ ఉండటం కూడా సినిమాకు కలిసి రాలేదనే చెప్పుకోవాలి. అలాగే మహారాష్ట్రలో రజనీకాంత్ బాగా పాపులర్ ఫేస్. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే రజనీ సినిమాకి మరీ అంత తక్కువ కలెక్షన్లా? మార్కెట్ ఎటుపోయింది? అంటూ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు.