కిరణ్ అబ్బవరం చెప్పిన ఆ సో కాల్డ్ స్టార్ హీరో ఇతడేనా.. ఫ్యాన్స్ భలే కనిపెట్టేశారే..!
నిన్న అనగా అక్టోబర్ 29 "క" సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు . ఇదే ఈవెంట్ కు స్పెషల్గా హాజరైన కిరణ్ అబ్బవరం భార్య కూడా చాలా చక్కగా మాట్లాడింది. అయితే స్టేజిపై ఎంతమంది ప్రముఖులు ఉన్నా సరే అందరి కాన్సన్ట్రేషన్ మొత్తం కిరణ్ అబ్బవరం పైనే పడింది . దానికి కారణం ఆయన మాట్లాడిన మాటలు. ఆయన మాట్లాడుతూ స్టేజిపై ఎమోషనల్ అయిపోయారు .
"జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒక ఆఫీస్ ఉంటుంది . వాళ్ల సినిమాలో నన్ను బాగా ట్రోల్ చేశారు . అసలు నన్ను అంతలా ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది..? నేను ఏం తప్పు చేశాను..? అంటూ తన ఆవేదన స్టేజి పై వ్యక్తం చేశాడు . అప్పుడే నాగచైతన్య కూడా పక్కకు వచ్చి ఆయనను ఓదార్చారు . అలాంటి స్టేట్మెంట్లను నువ్వు పట్టించుకోవద్దు అలా ట్రోల్ చేసే వాళ్ల గురించి అస్సలు ఆలోచించొద్దు అంటూ సపోర్ట్ చేయడంతో కిరణ్ అబ్బవరం మాట్లాడిన మాటలకు ఇంకా ప్రాముఖ్యత సంతరించుకునింది .
అసలు ఎందుకు కిరణ్ అబ్బవరాని టార్గెట్ చేశారు ..? జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఆఫీస్ ఎవరిది..? అంటూ చాలామంది సెర్చింగ్ మొదలుపెట్టారు. కొంతమంది ఏకంగా ఆ సీన్ ఏంటి ..?ఆ సినిమా ఏంటి..? అంటూ బాగానే జల్లెడ పడుతున్నారు. అయితే చాలామంది కొందరు ఆ సీన్ ని యూట్యూబ్ లో అదే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసేశారు. కానీ అది నిజంగా ఆయనను కించపరిచే విధంగా చేసిన కామెడీనేనా..? అనేది క్లారిటీ రాలేదు. అది తెలియడానికి కూడా పెద్ద సమయం పట్టదు అనుకోండి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ విషయం అయినా సరే చాలా ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు జనాలు . ఇంతకి ఆ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఆఫీస్ ఎవరిదో మీకు తెలుసా..???