మోహన్ బాబు కోసం చిరంజీవి అంతా త్యాగం చేశాడా.. ఆ మూవీతో ఏకంగా బ్లాక్ బాస్టర్..?

MADDIBOINA AJAY KUMAR
చాలా సంవత్సరాల క్రితం మోహన్ బాబు హీరోగా శోభన హీరోయిన్గా రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లుడు గారు అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాను మొదట రాఘవేంద్రరావు , మోహన్ బాబు తో కాకుండా చిరంజీవి తో చేయాలి అనుకున్నాడట. కానీ చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడట. అసలు ఏం జరిగింది. అంతా ఓకే అయ్యాక చిరంజీవి ని కాదు అని మోహన్ బాబును ఎందుకు ఈ సినిమాలో రాఘవేంద్రరావు హీరోగా తీసుకున్నాడు అనే వివరాలను తెలుసుకుందాం.

ఒకానొక సందర్భంలో రాఘవేంద్రరావు , చిరంజీవితో నీతో ఒక సినిమా చేయాలి అనుకుంటున్నాను. ఒక కథ తయారు చేస్తున్నాను అని అన్నాడట. దానితో చిరంజీవి ఓకే చేయండి సార్ అన్నాడట. ఇక కథ కొంత భాగం పూర్తయిన తర్వాత చిరంజీవికి వినిపించాడట. ఆయన కూడా ఆ కథ విను సూపర్ గా ఉంది సార్ మొత్తం తయారు చేయండి చేసేద్దాం అన్నాడట. ఇక కథ మొత్తం తయారు అయ్యాక ఒక రోజు చిరంజీవి కి రాఘవేంద్రరావు ఫోన్ చేసి కథ మొత్తం తయారు అయింది ... స్టోరీ సూపర్ గా వచ్చింది. కానీ నువ్వు హీరోగా నటిస్తే మాత్రం సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంది అన్నాడట. దానితో ఎందుకు సార్ అని చిరంజీవి , రాఘవేంద్రరావు ను అడగగా ... సినిమా క్లైమాక్స్ హీరో చనిపోయే సన్నివేశం ఉంది. నీలాంటి స్టార్ ఈమేజ్ ఉన్న హీరో చివరన చనిపోయాడు అంటే ఫ్యాన్స్ ఒప్పుకోరు.

సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈ కథతో వేరే హీరోని పెట్టి సినిమా చేస్తాను అన్నాడట. దానితో ఓకే సార్ అని చిరంజీవి అన్నాడట. దానితో రాఘవేంద్రరావు , మోహన్ బాబు ను సంప్రదించి ఈ కథను వినిపించగా , ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అల్లుడు గారు అనే టైటిల్ తో ఆ కథతో మూవీని రూపొందించాడట. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: