ఉపాసన పెళ్లి చూపుల్లో చరణ్ ని ఆ ప్రశ్న అడిగిందా..? చిరంజీవి షాక్..!

Thota Jaya Madhuri
చాలామందికి పెళ్లి చూపుల్లో రకరకాల ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడంటే ట్రెండ్ మారిపోయింది . పెళ్లిచూపులు లేకుండా డైరెక్ట్ గా ఈ అమ్మాయిని మేము లవ్ చేస్తున్నాము అంటూ ఇంటికి వచ్చి చూపించేస్తున్నారు కుర్రాళ్ళు . కానీ ఒకప్పుడు అలా కాదు ప్రేమించిన సరే ఇంట్లో పెద్దలకు చెప్పి సాంప్రదాయ ప్రకారం అబ్బాయి కుటుంబం అమ్మాయి  ఇంటికి పెళ్లిచూపులకి వెళ్లేవాళ్లు . కాగా  సినీ ఇండస్ట్రీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉపాసన విషయంలో ఇదే విధంగా చేశారట . ఉపాసన - రాంచరణ్ చైల్ హుడ్ ఫ్రెండ్స్ . వీళ్లిద్దరూ జాన్ గిజిడి దోస్తులు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది . 7ఏళ్ళు ప్రేమించుకున్నారు.  ఆ తర్వాత ఇంట్లో వాళ్లకు చెప్పి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. చరణ్..ఉపాసనని ప్రేమిస్తున్నాను అని చిరంజీవి గారికి చెప్పగా చిరంజీవి గారు ఏం మాత్రం నో చెప్పలేదట .


ఉపాసన మంచితనం ఆయనకి ముందే తెలుసు. అయితే ఇరు కుటుంబాలు మాట్లాడుకున్న తర్వాత పద్ధతి ప్రకారం ఉపసనాను మా అమ్మాయి అనిపించుకోవడానికి పెళ్లి చూపులు తరహాలో మెగా కుటుంబం ఉపాసన ఇంటికి వెళ్లిందట .అయితే సరదాగా అక్కడ జరిగిన ఒక సీన్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. వీళ్లది లవ్ మ్యారేజ్ . అయినా పద్ధతి ప్రకారం పెళ్లి చూపుల్లో అబ్బాయి కుటుంబం అమ్మాయిని అడగాల్సిన ప్రశ్నలు చాలా సరదాగా అడిగారట .


ఉపాసన ను పలు రకాల ప్ర్శ్నలతో ఆట పట్టించారట.  అదే విధంగా మా కొడుకుని బాగా చూసుకోవాలి అంటూ కూడా సరదాగా చెప్పుకొచ్చిందంట సురేఖ. చిరంజీవి మాత్రం సైలెంట్ గా ఉండిపోయారట . అయితే ఉపాసన కూడా తిరిగి చరణ్ ను చాలా స్ట్రైట్ గా క్వశ్చన్ చేసిందట . "పెళ్లి తర్వాత నువ్వు ఎవరికీ ఇంపార్టెన్స్ ఇస్తావు మీ అమ్మగారికా ..? నాకా..?" అంటూ చాలా సూటిగా ప్రశ్నించిందట.


ఈ ఒక్క ప్రశ్నతో అక్కడే ఉన్న చిరంజీవి షాక్ అయిపోయారట. అయితే చరణ్ మాత్రం చాలా చాలా బ్రిలియంట్ ఆన్సర్ ఇచ్చారట . "తల్లిని ప్రేమించే ప్రతి మగాడు తన భార్యను  బాగా చూసుకుంటాడు.. ప్రతి ఒక్కడు తన భార్యను ఎక్కువగా ప్రేమిస్తాడు.. అంతే బాగా చూసుకుంటాడు" అంటూ ఆన్సర్ ఇవ్వడంతో అక్కడ ఉన్నవాళ్లు చప్పట్లు కొట్టి చరణ్  ఆన్సర్ ని మెచ్చుకున్నారట . వీళ్ళ పెళ్లి చూపులు చాలా సరదా సరదాగా ఫన్నీగా జరిగాయట . దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయితే ఎలాంటి టాక్ దక్కించుకుంటుందో అంటూ మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: