పెళ్లికి ముందే అక్కినేని కోడలుగా గుర్తింపు.. ANR అవార్డ్స్ కోసం ఏం చేసిందో తెలుసా..?

Pulgam Srinivas
అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తన కంటూ తెలుగు సినీ పరిశ్రమలో ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో అక్కినేని నాగచైతన్య ఒకరు. ఈయన కొంత కాలం క్రితం సమంత అనే తన తోటి నటిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత వీరి సంసార జీవితం కొంత కాలం పాటు అద్భుతంగా ముందుకు సాగింది. కానీ ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్ధలు ఏర్పడడంతో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఎవరికి వారే జీవిస్తున్నారు. ఇక సమంత తో విడిపోయిన తర్వాత నాగ చైతన్య తన తోటి నటి అయినటువంటి శోభిత ధూళిపాళ తో ప్రేమలో పడ్డాడు.

ఇక వీరిద్దరి తల్లిదండ్రులు కూడా ఈ ప్రేమ వివాహానికి అంగీకరించడంతో కొన్ని రోజుల క్రితమే వీరి ఎంగేజ్మెంట్ కూడా అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య జరిగింది. ఇంకా వీరికి పెళ్లి కాలేదు. కానీ పెళ్లి పనులు మాత్రం మొదలైనట్లు తెలుస్తోంది. పెళ్లి కాకముందే నాగార్జున ఈమెకు అక్కినేని కోడలు పోస్టును ఇచ్చేసినట్లు అర్థం అవుతుంది. ఎందుకు అంటే నిన్న రాత్రి ANR అవార్డ్స్ వేడుక జరిగిన విషయం మనకు తెలిసిందే. ఇక ANR అవార్డు ఈ సారి చిరంజీవి కి ఇచ్చారు. దీనిని అమితా బచ్చన్ , చిరంజీవి కి బహుకరించారు.

ఇకపోతే ఈ అవార్డ్స్ వేడుకకు అతిథులను ఆహ్వానించే విషయంలో శోభిత అత్యంత కీలక పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. ఎంతో మంది కీలక అతిధులను ఈమె దగ్గరుండి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అవార్డ్స్ వేడుకలో శోబిత ను నాగర్జున దగ్గరుండి చిరంజీవి , అమితా బచ్చన్ లకు పరిచయం చేశాడు. ఇక అమల కూడా ఈమెపై ఎంతో గౌరవాన్ని చూపించండి. ఇలా నాగ చైతన్య , శోభిత ధూళిపాల వివాహం జరగకముందే అక్కినేని వారంతా ఈమెను కోడలుగా అంగీకరించినట్లు క్లియర్ గా అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: