కోదండరామిరెడ్డి: సినీ కేరిర్ లో వరుస హిట్లతో దంచిపడేసిన దమ్మున్న డైరెక్టర్.!

FARMANULLA SHAIK
చలనచిత్ర రంగంలో ఒక సినిమా నిర్మించడం అంటే మాములు విషయం కాదు ఎంతోమంది కలిసి కట్టుగా తమ తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే సినిమా హిట్. ఒకవేళ ఏం కొంచం తేడాపడిన పడ్డ కష్టంతో పాటు భారీగా నిర్మాతలకు నష్టాన్ని కలగజెస్తాయి.అయితే సినిమాను నిర్మించడంలో ఒక్కొ డైరెక్టర్ ఒక్కొ కోణంలో ఆలోచిస్తారు. అయితే అలాంటి  కోణాలన్నీ ఔపోసన పట్టేసిన అప్పటి దర్శకుల్లో కోదండరామిరెడ్డి ఒకరు.తెలుగు సినిమా దర్శకులలో దాసరి, రాఘవేంద్రరావు తర్వాత ఆ స్థాయిలో ఘన విజయాలను సొంతం చేసుకున్న అగ్ర దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి.ఏ డైరెక్టర్కైనా కెరీర్లో కొన్ని బ్లాక్ బ్లస్టర్లు, సూపర్ హిట్లు ఉండటం సహజం కానీ ఆయన కెరీర్లో తీసిన చిత్రాల్లో 90శాతం విజయవంతమైన చిత్రాలే ఉండటం గొప్ప విశేషం.కోదండరామిరెడ్డి సినిమాల్లో సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉండేది. ముఖ్యంగా చక్రవర్తితో ప్రారంభమైన ఆయన సంగీతప్రయాణం.ఆ తర్వాత ఇళయరాజాను తెలుగులో పెద్ద సినిమాలకు పరిచయం చేసేలా చేసింది.
నెల్లూరు జిల్లాకు చెందిన కోదండరామిరెడ్డి హీరో అవ్వాలని చెన్నైకి వెళ్లారు కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల హీరోకు బదులుగా  అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాల్సి వచ్చింది. ఆయన మొదట వి.మధుసూదన రావు దగ్గర ఆ తర్వాత దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు గారి దగ్గర  సహాయకుడిగా పనిచేసారు.కోదండరామిరెడ్డికి కృష్ణ, రజినీకాంత్ హీరోలుగా తెరకెక్కిన ‘రామ్ రాబర్ట్ రహీమ్’ సినిమాకు డైరెక్షన్ చేయాలనీ ఛాన్స్ వచ్చినప్పటికి అది కార్య రూపం దాల్చలేదు.1980లో ‘సంధ్య’ సినిమాతో దర్శకుడయ్యారు.ఆ తర్వాత చిరంజీవి, రాధిక జంటగా తెరకెక్కించిన ‘న్యాయం కావాలి’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు.ఆ సినిమా తర్వాత కోదండరామిరెడ్డి వెనుదిరిగి చూసుకోలేదు.ఇక కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖైదీ’ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసారు.ఆయన బాలకృష్ణతో చేసిన చిత్రాల్లో ఎక్కువ శాతం సక్సెస్గా నిలిచాయి.అలాగే నాగార్జున, వెంకటేష్‌తో పాటు సీనియర్ హీరోలు ఏన్నార్,కృష్ణ,కృష్ణంరాజు,శోభన్ బాబు, మోహన్ బాబుతో పాటు కమల్ హాసన్‌తో  పలు సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించారు.ఒక్క ఎన్టీఆర్‌తో తప్పించి మిగిలిన అగ్ర హీరోలందరితో సినిమాలు తెరకెక్కించాడు.ఎన్టీఆర్తో ఒకటి రెండు సార్లు సినిమా తెరకెక్కించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది.
ఇన్నేళ్ల కెరీర్‌లో కోదండరామిరెడ్డి హిందీతో పాటు తమిళ, కన్నడలో ఒక్కో చిత్రాన్ని తెరకెక్కించారు.ఆయన చేసిన 93 సినిమాలలో చిరంజీవితో 25,బాలకృష్ణతో 13, నాగార్జునతో 7, వెంకటేశ్‌తో 2 సినిమాలు చేశారు.చివరగా అయన తన కుమారుడు వైభవ్ తో కలిసి రెండు సినిమాలు చేశారు.కానీ అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి.ఏదేమైనా టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా కోదండరామిరెడ్డిది ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి.అయితే ప్రస్తుతం ఆయన కుటుంబంతో ఎక్కువ సేపు గడుపుతూ కాలం గడిపేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: