టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన క్యూట్ స్మైల్, చబ్బి లుక్స్ తో ప్రేక్షకులలో మంచి ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచియమైన ఈ క్యూట్ భామ. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ భామ తెలుగులో జోరు, జిల్, బెంగాల్ టైగర్, శివం, సుప్రీం, హైపర్ వంటి సినిమాలలో నటించింది.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ జై లవకుశ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. అందం,టాలెంట్ వున్నా రాశి ఖన్నాకు ఇప్పటి వరకు సరైన బ్రేక్ రాలేదు... కెరీర్ స్టార్ చేసి చాలా కాలం అయినప్పటికీ ఈ భామ కెరీర్లో పెద్దగా హిట్లు అయితే లేవు. స్టార్ హీరోలతో నటించే అవకాశం రాశి ఖన్నాకు దక్కినట్టే దక్కి చేజారిపోయింది..ఎన్టీఆర్ మినయిస్తే మిగిలిన హీరోలెవ్వరూ కూడా రాశి ఖన్నాకు ఛాన్స్ ఇవ్వలేదు..ఇక యంగ్ హీరోలతో రాశి ఖన్నా నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి. దీంతో ఈ భామ బాలీవుడ్ కు వెళ్ళింది..
అయితే ఈ అమ్మడుకు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. బాలీవుడ్లో హాట్ బికినిలో కనిపించి హీటెక్కించిన, లిప్‌లాక్ లతో మత్తెక్కించిన పెద్దగా లాభం లేకుండా పోయింది. కానీ హిందీ మేకర్స్ మాత్రం రాశి ఖన్నాకు వరుస అవకాశాలిస్తూ వస్తున్నారు...రాశి ఖన్నా ప్రస్తుతం 'సబర్మతి రిపోర్ట్' అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న రాశి ఖన్నా పెళ్లి , పిల్లల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది..పెళ్లి అనేది నా పర్సనల్ విషయం కాబట్టి దాని గురించి ఇప్పుడు దాని గురించి మాట్లాడాలి అనుకోవడం లేదు.నాకూ పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనే ఉంది కానీ ఇప్పుడు అంత టైం లేదు... అది నా పర్సనల్ విషయం నా వృత్తితో దాన్ని జత చేయాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకుంటే నేను కచ్చితంగా అందరికి చెబుతాను ప్రకటిస్తా దయచేసి రూమర్స్ క్రియేట్ చేయకండి అని రాశి తెలిపింది..