పుష్ప 2 : అల్లు అర్జున్ ను కోలుకోని దెబ్బ కొట్టిన రేవంత్ ?

Veldandi Saikiran

టాలీవుడ్ స్టార్, హీరో ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  మెగా కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన... అల్లు అర్జున్ ఆ తర్వాత... తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. గంగోత్రి సినిమాతో తన కెరీర్ ప్రారంభించిన అల్లు అర్జున్... ఈ సినిమా సక్సెస్ కావడంతో వరుసగా సినిమాలు చేశారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రశ్రేణి హీరోగా మారిపోయారు అల్లు అర్జున్.
 
ముఖ్యంగా అల్లు అర్జున్ చేసిన లేటెస్ట్ సినిమా పుష్ప.. ఆయనను ఐకాన్ స్టార్ గా మార్చిన సంగతి తెలిసిందే. అప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాలలోనే... పాతుకుపోయిన అల్లు అర్జున్... పుష్ప సినిమా తర్వాత... ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. పుష్ప రెండేళ్ల కిందట రిలీజ్ అయి ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు పుష్ప రెండవ భాగం కూడా రిలీజ్ కాబోతుంది.
 
డిసెంబర్ ఐదో తేదీన అల్లు అర్జున్ హీరో గా చేసిన పుష్ప రెండో భాగం రిలీజ్  కాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తో... పుష్ప సినిమాకు ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్ మహా. నగరంలో.. 30 రోజులపాటు 144  సెక్షన్ విధించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే అక్టోబర్ 28 వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి.
 
పుష్ప సినిమా డిసెంబర్ ఐదో తేదీన రిలీజ్ కానుంది. అంటే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ దాదాపు వారం రోజులు ముందే జరగాలి. కానీ హైదరాబాదు లో ఆంక్షలు విధించడంతో... పుష్ప ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరిగే అవకాశాలు లేనట్లు... చెబుతున్నారు. ఎలాగో 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో... పుష్ప సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఏపీలో నిర్వహించాలని అనుకుంటున్నారట. ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: