ఆ విషయంలో ప్రతిసారి ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేస్తున్న కాజల్..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్న నటీమణులలో కాజల్ అగర్వాల్ ఒకరు . ఈమె తేజ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ మూవీ ద్వారా ఈమెకు పెద్ద స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత చందమామ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు కూడా లభించింది. ఆ తర్వాత కాజల్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో మగధీర అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. 

ఈ మూవీ ఏకంగా ఆల్ టైం టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలవడం , ఈ సినిమాలో కాజల్ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ మూవీ తో ఓవర్ నైట్ లో ఈ బ్యూటీ కి స్టార్ హీరోయిన్ క్రేజ్ తెలుగులో వచ్చేసింది. ఆ తర్వాత ఈమె వరుస పేట్టి స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్గా నటించింది. అందులో చాలా సినిమాలు విజయం సాధించడంతో ఇప్పటికి కూడా కాజల్ అగర్వాల్ తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈమెకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కానీ ఈమె ఒక్క విషయంలో మాత్రం తన అభిమానులను డిసప్పాయింట్ చేస్తూనే వస్తుంది.

అది ఎందులో అనుకుంటున్నారా ..? లేడీ ఓరియంటెడ్ సినిమాల విషయంలో. తన తోటి హీరోయిన్లు ఇప్పటికే ఎంతో మంది లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి అద్భుతమైన విజయాలను అందుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ కాజల్ ఇప్పటి వరకు చాలా సార్లు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించిన ఎప్పుడూ విజయాన్ని అనుకోలేదు. దానితో ఈమె అభిమానులు కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: