13 ఏళ్ల ' 7th సెన్స్‌ ' ... ఫైన‌ల్‌గా ఎంత క‌లెక్ట్ చేసిందంటే...!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
తమిళ స్టార్ హీరో సూర్యకు తమిళం తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభించి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు సూర్య. ఇదిలా ఉంటే ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన సినిమా గజిని. అప్పట్లో ఈ సినిమా సౌత్ ఇండియాను ఒక ఊపు ఊపేసింది. సూర్యకి జోడిగా ఆశిన్ - నయనతార హీరోయిన్లు గా నటించారు. ఆ తర్వాత అదే మురుగదాస్ - సూర్య కలిపి చేసిన రెండో సినిమా సెవెంత్ సెన్స్.

ప్రస్తుత తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాకు నిర్మాత. 2011 అక్టోబర్ 26న విడుదలైన ఈ సినిమా తాజాగా 13 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో సూర్య రెండు రకాల షేడ్స్ కలిగిన పాత్రలో చేసిన నటన సూపర్ అని చెప్పాలి. హరీష్ జయరాజ్ సంగీతం కూడా సూపర్ గా ఉంటుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ అంచనాలతో రిలీజ్ అయింది. 13 సంవత్సరాల క్రితమే సెవెంత్ సెన్స్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో పదికోట్ల బ్రేక్ మీద టార్గెట్‌తో రిలీజ్ అయింది.

ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా రు. 14 కోట్ల షేర్ రాబట్టి సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా యావరేజ్ గా అనిపించినా.. తెలుగు వెర్షన్ మాత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో సూర్యకి జోడిగా శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. డాంగ్లీ అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో చైనాకు చెందిన ఓ నటుడు నటించాడు. ఇక సూర్య త్వరలోనే శివ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న కంగువ‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భారీ అంచనాలతో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: