కధ ఏంబాగోలేదు...అయినసరే సినిమా చేద్దామంటూ డైరెక్టర్ కి షాకిచ్చిన మెగాస్టార్.!

FARMANULLA SHAIK
తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడు కోడి రామకృష్ణతో చిరంజీవి కాంబినేషన్‌కు మంచి క్రేజే ఉండేది. చిరంజీవి, దర్శకుడు కోడి రామకృష్ణ కాంబినేషన్‌లో మొత్తంగా ఆరు చిత్రాలు తెరకెక్కాయి.చిరంజీవి, దర్శకుడు కోడి రామకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాదు ఈ చిత్రం ఏకధాటిగా యేడాది పాటు నడిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.ఈ చిత్రంతో చిరంజీవి తొలిసారి తన నటజీవితంలో స్వర్ణోత్సవం చూశారు. మొదటి సినిమాతోనే ‘గోల్డెన్ జూబ్లీ’ పట్టేసిన కోడి రామకృష్ణ ఆ తరువాత మరికొన్ని స్వర్ణోత్సవాలతో ‘గోల్డెన్ జూబ్లీ డైరెక్టర్’ అనిపించుకున్నారు. ఈ సినిమాతోనే ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు నటునిగా పరిచయమై, తరువాత వందలాది చిత్రాల్లో తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. ఇన్నివిశేషాలకు కారణమైన ‘ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య’ చిత్రం 1982 ఏప్రిల్ 23న విడుదలయింది.ఇదిలావుండగా ఆ చిత్రం విషయంలో చాలా ఊహించని మలుపులు జరిగాయట. ఈ చిత్రాన్ని నిర్మాత కోటిపల్లి రాఘవ నిర్మించారు. కోడి రామకృష్ణ ముందుగా కథని రాఘవకి చెప్పారు. హీరోగా ఎవరిని అనుకుంటున్నావు అని అడిగారు. దీనికి కోడి రామకృష్ణ సమాధానం ఇస్తూ చిరంజీవి అని చెప్పారు. చిరంజీవికి అప్పుడప్పుడే మంచి గుర్తింపు వస్తోంది.కానీ రాఘవకి నమ్మకమైన హీరోలు కొందరు ఉన్నారు. వారిలో ఎవరో ఒకరితో ఈ చిత్రం చేయాలని అడిగారట. 

కోడి రామకృష్ణ అందుకు ఒప్పుకోలేదు. ఈ కథకి చిరంజీవి అయితేనే కరెక్ట్ అని చెప్పారట. అయితే ఈ రోజు సాయంత్రం కొందరు పెద్దలతో మీటింగ్ ఏర్పాటు చేస్తా.. నా హీరోలు కాకుండా ఈ చిత్రానికి చిరంజీవిని ఎందుకు తీసుకోవాలో ఆ మీటింగ్ లో నువ్వు అందరిని కన్విన్స్ చేయాలి. లేకుంటే ఈ సినిమా నేను చేయను అని రాఘవ చెప్పారట.ఈ నేపథ్యంలో రాఘవ గారు చిరంజీవిని పిలిపించి కోడి రామకృష్ణని పరిచయం చేశారు. నన్ను చూసి కుర్రాడిని ఎంకరేజ్ చేయాలనిపిస్తోంది అని చిరంజీవి అన్నారు. మాది కూడా మొగల్తూరు సర్ అని చెప్పారట కోడి రామకృష్ణ.. అవునా అని చిరంజీవి అంటే.. పక్కనే పాలకొల్లు సర్ అని రామకృష్ణ అన్నారు. సరే నాకు టైం ఉన్నప్పుడు ఇంటికి పిలుస్తాను.. కథ చెప్పు అని అడిగారు. కానీ కండిషన్.. కథ నచ్చితేనే సినిమా చేస్తా లేకుంటే లేదు అని చిరంజీవి అన్నారు. ఆ తర్వాత కోడి రామకృష్ణ చిరంజీవికి ఇంటికి వెళ్లి కథ చెప్పారు. 3 గంటల పాటు చిరంజీవి కథ విన్నారు. కథ నచ్చిందో లేదు చెప్పలేదు. సస్పెన్స్ లో పెట్టేశారు. హార్లిక్స్ తాగుతావా అని అడిగారు.. వెంటనే సురేఖ గారు హార్లిక్స్ తీసుకువచ్చారు.కథనాకు పూర్తిగా నచ్చలేదు అని చిరంజీవి షాకిచ్చారట. కానీ మిగిలిన పాత్రలు చాలా బావున్నాయి. కాబట్టి ఈ సినిమా నేను చేస్తున్నాను అని చెప్పారు. ఆయా విధంగా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో పూర్ణిమ, మాధవి హీరోయిన్లుగా నటించారు.ఇదిలావుండగా ఓ చిన్న సినిమాగా వచ్చిన ‘ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య’ 517 రోజులు ఆడడంతో అందరూ హీరో చిరంజీవి, దర్శకుడు కోడి రామకృష్ణపై ప్రత్యేక దృష్టి సారించేలా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: