పది సంవత్సరాల కింద ‘అందాల రాక్షసి’ సినిమాతో దర్శకుడిగా మారిన హను రాఘవపూడి సీతారామం సినిమాతో మొదటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. విజయం కంటే ఎక్కువగా ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 2022 లో కూడా ప్యూర్ లవ్ స్టోరీ చెప్పి మరికొన్ని దశాబ్దాల వరకు ప్రేక్షకులకు గుర్తుండిపోయే క్లాసిక్ అందించాడు ఈయన. వైజయంతి మూవీస్ నిర్మించిన సీతారామం దాదాపు 42 కోట్ల షేర్ వసూలు చేసింది.“సీతారామం”కు యుద్ధంతో రాసిన ప్రేమకథ అనే ట్యాగ్ లైన్ చాలా యాప్ట్. హను తరహా సినిమాలను ఆస్వాదించే ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకునే సినిమా ఇది. ప్రేమ, యుద్ధం, త్యాగంతోపాటు హను ఎలివేట్ చేసిన మానవీయ కోణం ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం.ఇదిలావుండగా అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు హను. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయాడు. అయితే సాలిడ్ సక్సెస్ మాత్రం సీతారామం సినిమాతోనే అందుకున్నాడు.
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో దుల్కర్, మృణాల్ తమ నటనతో కట్టిపడేశారు. అలాగే సీతారామం సినిమాలో రష్మిక మందన్న కీలక పాత్రలో నటించి మెప్పించింది.హను సినిమాకి టెక్నికాలిటీస్ బెస్ట్ ఉంటాయి. ఈ సినిమాకి వైజయంతీ మూవీస్ బ్యానర్ పెద్ద ఎస్సెట్ గా నిలిచింది. హను మదిలోని కథను తెరపై అద్భుతంగా ప్రెజంట్ చేయగలిగాడంటే కారణం వైజయంతీ మూవీస్ & స్వప్న సినిమా సంస్థలు కథను, దర్శకుడిని నమ్మి.. ఎలాంటి పరిమితులు లేకుండా సినిమాకి కావాల్సినంత ఖర్చు చేయడమే. మరో బ్యానర్ లో ‘సీతారామం” ఇంతే అద్భుతంగా ఉండేది కాదేమో. విశాల్ చంద్రశేఖర్ పాటలు, నేపధ్య సంగీతం సినిమాకి ఆయువుపట్టు. వాటి ప్లేస్ మెంట్ & పిక్చరైజేషన్ కూడా ఎంతో అందంగా ఉంది.
పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ ఎంత బాగుందంటే.. కాసేపు ప్రేక్షకుల్ని ఎత్తుకెళ్లి కాశ్మీర్ & ఓల్డ్ హైద్రాబాద్ రోడ్ల మీద కూర్చోబెట్టేశాడు. స్లోమోషన్ షాట్స్ ను రెగ్యులర్ లాంగ్ ఫ్రేమ్స్ లో కాకుండా.. క్లోజప్స్ లో చూపించిన విధానం బాగుంది. ఆర్ట్ వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ ను ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. దర్శకుడు హను సినిమాల్లో, పాత్రల్లో ప్రేమ, బాధ, వెలితి లాంటి ఫీలింగ్స్ తోపాటు మానవత్వం తొణికిసలాడుతుంటుంది. “అందాల రాక్షసి”లో రాహుల్ పాత్ర ప్రాణ త్యాగం చేసినా, “పడిపడి లేచే మనసులో” శర్వ తనను తాను పోగొట్టుకున్నా, “కృష్ణగాడి వీర ప్రేమగాధ” నాని పిల్లల కోసం తన ప్రేమను పణంగా పెట్టినా అక్కడా త్యాగానికంటే మానవత్వం ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే.. “సీతారామం”లో ఆ మానవత్వపు ఛాయలు చాలా ధృఢంగా కనిపిస్తుంటాయి. యుద్ధం, మతం వంటి విషయాలను ఎంత స్వచ్ఛంగా చూపించొచ్చు అనే విషయాన్ని ఇప్పటికీ మణిరత్నం పదులసార్లు తెరకెక్కించినా హను అదే విషయాన్ని ఇంకాస్త కవితాత్మకంగా తెరకెక్కించి మార్కులు కొట్టేశాడు.ఇదిలావుండగా ప్రస్తుతం హను రాఘవపూడి,ప్రభాస్ హీరో గామూవీచేస్తున్న సంగతి తెలిసిందే ఈ మూవీ 1940 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కకబోతుందని సమాచారం.