మీ కొడుకు సినిమాల్లోకి వస్తాడా.. సూర్య షాకింగ్ ఆన్సర్.. కన్ఫ్యూజన్లో ఫ్యాన్స్?
దీంతో చాలామంది సీనియర్ హీరోలు తమ అభిమానులను నిరాశకు గురి చేయకుండా ఇక తమ వారసులను సినిమాల్లోకి పరిచయం చేయడం చూస్తూ ఉంటాము. అయితే ఈ మధ్యకాలంలో అయితే కొంతమంది స్టార్ హీరోలు తమ పిల్లలను చిన్న వయసులోనే ఇండస్ట్రీకి పరిచయం చేయడం కూడా చూస్తూ ఉన్నాం. కాగా ఇటీవల ఇలా వారసుడు ఎంట్రీ గురించి తమిళ స్టార్ హీరో సూర్యకి కూడా ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం సూర్య కంగువ సినిమాలో నటించగా.. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా వారసుడు ఎంట్రీ ఎప్పుడు అనే ప్రశ్న సూర్యకి ఎదురైంది.
దీంతో సూర్య చెప్పిన ఆన్సర్ అభిమానులందరికీ కూడా కన్ఫ్యూషన్ లో పెట్టేసింది. కాలేజీ పూర్తవ్వగానే నేను మూడేళ్లు గార్మెంట్ పరిశ్రమలో పనిచేశా. భవిష్యత్తులో కూడా అక్కడే పని చేస్తానని అనుకున్నా. కానీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను అంటూ సూర్య చెప్పుకొచ్చాడు. ఇక మా కొడుకు దేవ్ ఎప్పుడు మూవీలోకి వస్తాడో రాదో తెలియదు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. చదువుతోపాటు ఆటల్లోనూ ముందుంటాడు. అతని సినిమాల్లోకి రావాలని మాత్రం ఫోర్స్ చేయలేను. అతను ఏ రంగానే ఎంచుకున్న నేను ప్రోత్సహిస్తా అంటూ చెప్పాడు. దీంతో సూర్య వారసుడు సినిమాల్లోకి వస్తాడా రాడా అనే విషయంపై అభిమానులు కన్ఫ్యూషన్ లో పడిపోయారు.