గీత గోవిందం: ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్.. ఈ కలక్షన్స్‌ నెవ్వర్ బిఫోర్..?

Suma Kallamadi
* గీత గోవిందం ఒక ఆల్ టైమ్‌ బ్లాక్‌బస్టర్
* రూ.5 కోట్లతో తీస్తే రూ.132 కోట్లు వచ్చాయి  
* చిన్న సినిమాతో మ్యాజిక్ క్రియేట్ చేశాడు పరశురాం
(ఏపీ - ఇండియా హెరాల్డ్)
2018లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ "గీత గోవిందం" ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. దీనికి పరశురామ్ కథ అందించి దర్శకత్వం వహించారు. దీనిని GA2 పిక్చర్స్ నిర్మించింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించారు. వారికి కెమిస్ట్రీ బాగా పండింది. వారిద్దరిని చూసి ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ చిత్రం 2018, ఆగస్టు 15న విడుదలైంది. రూ.5 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఏకంగా రూ.132 కోట్లను రాబట్టి పెద్ద హిట్ అయింది.అది ఎన్ని రెట్లు ఎక్కువగా లాభాలు తెచ్చిపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. రూ.5 కోట్లు అంటే చాలా చిన్న మూవీ అని చెప్పుకోవచ్చు, కానీ ఇది బడా హీరోల సినిమాలతో సమానంగా డబ్బులు వసూలు చేసింది. 2018 కాలంలో ఏ తెలుగు సినిమా కూడా ఈ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేయలేదు. చిన్న సినిమాతో కూడా 100 క్రోర్ క్లబ్ లో చేరవచ్చు అని పరశురాం నిరూపించాడు.
సినిమా క్రిటిక్స్ ఈ స్టోరీ రొటీన్‌ది అయినా వారు ఈ చిత్రానికి దర్శకత్వం, నటన, నిర్మాణ నాణ్యతను ప్రశంసించారు. ఈ మూవీ థియేట్రికల్ హక్కుల నుంచి రూ.15 కోట్లు సంపాదించింది. గోపీ సుందర్ సంగీతం కథకు బాగా సరిపోతుంది. సిద్ శ్రీరామ్ పాడిన "ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే" అనే పాట బాగా పాపులర్ అయింది. నటులు వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, అభయ్ బేటిగంటి నుండి వచ్చిన హాస్యం చిత్రానికి తెలివిని జోడించింది. మొత్తంమీద, గీత గోవిందం మంచి కామెడీ, అద్భుతమైన సంగీతం, క్యూట్ హీరో హీరోయిన్ల పేర్లతో అందరి హృదయాలను తాకింది.విజయ్ దేవరకొండ ఎన్టీఆర్ కెరీర్ లో అర్జున్ రెడ్డి తర్వాత అతిపెద్ద హిట్ అయింది. గీత గోవిందం మాత్రమే. ఈ సినిమాతోనే రష్మిక మందన్న కెరీర్ కీలక మలుపు తిరిగింది దీని తర్వాత ఆమె తన జీవితంలో వెనుతిరిగి చూసుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: