స్టేజ్ మీదే సూర్యకి ప్రపోజ్ చేసిన తెలుగు యాంకర్..భార్యతో గొడవ.?

Pandrala Sravanthi
కోలీవుడ్ నటుడు సూర్య నటించిన తాజా సినిమా కంగువా.ఈ మూవీ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే నటుడు సూర్య ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. హైదరాబాద్,చెన్నై అంటూ తిరుగుతూ అన్నిచోట్ల ప్రమోషన్స్ భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా కంగువాకు సంబంధించిన సినిమా ఈవెంట్ ని వైజాగ్ లో చాలా గ్రాండ్ గా నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ కి హీరో సూర్యతో పాటు డైరెక్టర్ శివ కూడా వచ్చి అభిమానులకి కన్నుల విందు చేశారు. ఈ ఈవెంట్లో సినిమా గురించి మాట్లాడుతూ భారీ హైప్ పెంచేశారు.పాన్ ఇండియా వైడ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో సూర్య లుక్ కి చాలామంది ఫిదా అయిపోయారు. 

డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న కంగువా మూవీ 14న విడుదలవబోతుండడంతో సినిమా కోసం భారీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైజాగ్ లో జరిగిన ఈ ఈవెంట్ కి యాంకర్ రవి,యాంకర్ స్రవంతి ఇద్దరు కలిసి హోస్టులుగా చేశారు. అయితే ఈ ఈవెంట్లో చాలామంది స్టేజ్ మీదకి ఎక్కి హీరో సూర్యతో ఫోటోలు తీయించుకొని సెల్ఫీలు తీయించుకుని వెళ్లారు. కానీ వెరైటీగా యాంకర్ స్రవంతి మాత్రం ఆయనకు ప్రపోజ్ చేయడంతో దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. యాంకర్ స్రవంతి సడన్ గా ఒక గులాబీ పువ్వు చేతిలో పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చొని మరీ హీరో సూర్యకి ప్రపోజ్ చేసింది. 
అయితే ఈమె చేసిన పనికి అందరూ షాక్ అవ్వగా సూర్య చేసిన పనికి మాత్రం అందరూ ఫిదా అయ్యారు.

ఎందుకంటే.. యాంకర్ స్రవంతి ఎలా అయితే మోకాళ్ళ మీద కూర్చొని సూర్యకి ప్రపోజ్ చేసిందో అచ్చం ఆమెలాగే సూర్య కూడా మోకాళ్ళ మీద కూర్చొని ఆమె ఇచ్చిన రోజా పువ్వు తీసుకొని థాంక్యూ చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలా మంది నెటిజన్స్ అంత పెద్ద హీరో అయిన సూర్య ఇంత సింపుల్ గా ఉంటారా అని ఆయన అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు ఈ ఫొటోస్ ని..ఇక హీరో సూర్య తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు.అయితే ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవ్వడంతో కొంతమంది నెటిజెన్స్ ఈ ఫొటోస్ సూర్య భార్య జ్యోతిక చూస్తే ఇంట్లో గొడవ గొడవ చేస్తుంది అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: