నాతో కాళ్లు పట్టించుకుంటావా అంటూ హీరోయిన్ పై ఫైర్ అయిన ఏఎన్ఆర్.?

Pandrala Sravanthi
ఏంటి దిగ్గజ నటుడు ఏఎన్ఆర్ ఓ హీరోయిన్ కాళ్లు పట్టుకున్నాడా.. ఎందుకు ఏఎన్ఆర్ అలాంటి పని చేశారు.. ఇంతకీ ఏఎన్ఆర్ ఎవరి కాళ్లు పట్టుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. అక్కినేని నాగేశ్వరరావు సినిమా ఇండస్ట్రీలోనే ఒక పేరున్న నటుడు.అయితే అలాంటి ఈయనతో కాళ్లు పట్టించుకున్న హీరోయిన్ ఎవరో కాదు సీనియర్ నటి రోహిణి.. రోహిణి ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా చేసి ఆ తర్వాత తల్లిపాత్రల్లో కూడా నటిస్తోంది. ఇక ఈమె ప్రముఖ దివంగత నటుడు రఘువరన్ భార్య అనే సంగతి మనకు తెలిసిందే. అయితే రఘువరన్ రోహిణి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉంటే హీరోయిన్ రోహిణి ఓ సినిమాలో లెజెండరీ హీరోగా పేరున్న అక్కినేని నాగేశ్వరరావు తో కాళ్లు పట్టించుకుందట. ఇక మరొక విచిత్రం ఏమిటంటే.. అక్కినేని నాగేశ్వరరావు చాలా పెద్ద హీరో అనే సంగతి రోహిణికి కూడా తెలియదట. 

ఇక ఏఎన్ఆర్ ఆమె కాళ్ళు పట్టుకునే సమయంలో ఏయ్ అమ్మాయి నువ్వు ఎంత పెద్ద హీరోతో కాళ్లు పట్టించుకుంటున్నావో తెలుసా అని అన్నారట.దానికి అక్కినేని నాగేశ్వరరావు  గురించి తెలియని రోహిణి అసలు మీరు ఎవరో.. ఎంత పెద్ద హీరోనో నాకు తెలియదండి అని పంచ్ వేసిందట. ఇక రోహిణి మాట్లాడిన మాటలకు అక్కినేని నాగేశ్వరరావు సైతం చాలా గట్టిగా నవ్వారట. అయితే ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది నటి రోహిణి.

ఇక నటి రోహిణి కాళ్లు అక్కినేని నాగేశ్వరరావు మహాకవి క్షేత్రయ్య అనే సినిమాలో పట్టుకున్నారు.ఇక సినిమా స్క్రిప్ట్ లో భాగంగా ఎంత పెద్ద హీరో అయినా సరే కాళ్లు పట్టుకోవాలి అని రాసి ఉంటే సినిమా కోసం హీరోలు ఏది ఆలోచించకుండానే కాళ్లు పట్టుకుంటారు. కానీ ఈ హీరోల అభిమానులు మాత్రం అలా కాళ్లు పట్టుకునే సన్నివేశాలు వచ్చిన సమయంలో అస్సలు యాక్సెప్ట్ చేయలేరు.అలా ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్,ఏఎన్నార్, కమల్ హాసన్ వంటి ఎంతో మంది హీరోలు సినిమా స్క్రిప్ట్ లో భాగంగా కాళ్లు పట్టుకున్న సన్నివేశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: