హీరోయిన్ మేఘా ఆకాశ్ తెలుగ‌మ్మాయే ... ఈ సీక్రెట్ మీకు తెలుసా...!

RAMAKRISHNA S.S.
- మేఘా ఆకాష్ త‌ల్లి మ‌ళ‌యాళీ ... తండ్రి తెలుగు వ్య‌క్తే
- సాయి విష్ణు తో ఆరేళ్ల ప్రేమాయ‌ణం ... రీసెంట్ గానే పెళ్లి
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
హీరోయిన్ మేఘా ఆకాష్ ఇటీవల పెళ్లి చేసుకుని ఒక ఇంటిది అయింది. 2017లో నితిన్ హీరోగా వచ్చిన లై సినిమాతో మేఘ ఆకాష్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమా లో మేఘా ఆకాష్ న‌ట‌న తో పాటు ఆమె అందాలు .. క్యూట్ లుక్స్ చూసిన తెలుగు కుర్ర కారు అయితే ఫిదా అయిపోయారు. ఏమి అందం అని షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆమె ప‌లు సినిమాలలో నటించినా అనుకున్న క్రేజ్ రాలేదు. తమిళంలో మాత్రం ఎప్పటికప్పుడు సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మేఘా ఆకాష్ మలయాళీ అమ్మాయని అందరూ అనుకుంటారు. అయితే ఆమె తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి అన్న విషయం చాలామందికి తెలియదు. ఆమె చెన్నైలో పుట్టి పెరిగింది. మేఘా ఆకాష్‌ తండ్రి తెలుగు వ్యక్తి కావటం విశేషం.

తల్లి మలయాళీ అమ్మాయి. అలా మేఘ ఆకాష్ తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఆమె సాంప్రదాయ బద్దంగా అచ్చ తెలుగు ఆడపడుచులా కనిపిస్తుంది. 2017 నుంచి మెగా ఆకాష్ తెలుగుతో పాటు తమిళంలో సినిమాలు చేస్తుంది. రజనీకాంత్ తో పేట మూవీలో హీరోయిన్‌గా చేసిన పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక.. మేఘ గత ఆరు సంవత్సరాలుగా సాయి విష్ణు అనే కుర్రాడుతూ ప్రేమలో ఉంది. ఈ ఏడాది ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకునే సెప్టెంబర్‌లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మేఘా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇక పెళ్లయిపోవడంతో మేఘా కొత్తగా సినిమాలు చేస్తుందా.. లేదా యాక్టింగ్ కి పుల్ స్టాప్ పెడుతుందా.. అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: