బాహుబ‌లి 1 ఫ‌స్ట్ డే డిజాస్ట‌ర్ టాక్ వెన‌క‌.... షాకింగ్ సీక్రెట్ రివీల్‌...!

RAMAKRISHNA S.S.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌ను చేసిన సినిమా బాహుబలి. రాజమౌళి దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. 2015లో రిలీజ్ అయిన ఈ సినిమా గురించి.. నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా ఓ విషయాన్ని చెప్పారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించడానికి గల కారణంతో పాటు.. ఫస్ట్ డే నెగిటివ్ టాక్ రావటం పైన ఆయన స్పందించారు. బాహుబలి సినిమా తెర‌కెక్కించాలనుకున్నప్పుడు దానిని రెండు భాగాలలో తెరకెక్కించాలని.. బడ్జెట్‌కు అనుగుణంగా ఆ నిర్ణయం తీసుకున్నాం.

ఆ రోజుల్లో పార్ట్ 2 అనేది చాలా అరుదని.. ఒక సినిమాని రెండు భాగాల్లో తెర‌కెక్కిస్తే చూస్తారా.. రెండో భాగం వెంటనే విడుదల చేయకపోతే.. పార్ట్ 1 మర్చిపోతారా.. ఇలా ఎన్నో సందేహాలు తమను వెంటాడాయ‌ని శోభు యార్లగడ్డ తెలిపారు. ఇక ఈ రెండు పార్టీలు కలిపి ఒకేసారి షూటింగ్ చేసేద్దాం అనుకున్నాం. పార్ట్ 1 విడుదలైన మూడు నెలల్లోనే పార్ట్ 2 రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసాం. సినిమా షూటింగ్ మొదలయ్యాక అనుకున్న బడ్జెట్లో అది పూర్తి కాదని అర్థమైంది. అందుకే ముందు ఫస్ట్ పార్ట్ షూట్ చేసి రిలీజ్ చేశాం అని తెలిపారు. సినిమా విడుదలైన తొలి రోజు నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా బాగోలేదు పోయిందన్నారు.

తమ అంచనాలు అందుకోలేదని పలువురు అభిమానులు పేర్కొన్నారు. రెండో రోజు నుంచి రెగ్యులర్ ఫ్యామిలీ ఆడియన్స్ పెరిగారు. తొలిరోజు అలా.. రెండో రోజు ఇలా.. ఉండటానికి చాలా కారణాలు ఉంటాయని.. నా దృష్టిలో తెల్లవారుజామున వేసిన‌ షోలు ఎప్పుడు రిస్కే అని.. ఫ్యాన్స్ ఎన్నో అంచనాలతో సినిమా చూసేందుకు ఆ షోలకి వెళ్తారు. సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంటారు. వారి అంచ‌నాలకు ఏ కాస్త తగిన నెగిటివ్ టాక్ వస్తుందని తెలిపారు. నెగిటివ్ టాక్ వస్తే రెండో భాగం ఎలా చేయాలి.. అని రాజమౌళి ముందుగానే ప్లాన్ చేసుకున్నారని.. అదృష్టవశాత్తు తొలి భాగం సూపర్ డూపర్ హిట్ అయిందని.. రెండో భాగం అంతకుమించి సూపర్ డూపర్ హిట్ అయిందని.. రెండో భాగాన్ని రెండేళ్ల తర్వాత రిలీజ్ చేశామని శోభుయార్లగడ్డ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: