ఏపీ - తెలంగాణ‌లో ' ల‌క్కీ భాస్క‌ర్ ' క్రేజ్ ఏ రేంజ్‌లో అంటే... క‌ళ్లు జిగేల్‌...!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కు తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. మరి ముఖ్యంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెర‌కెక్కిన మహానటి సినిమాలో దుల్కర్ చేసిన నటన తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేసింది. దుల్కర్ అంటే మలయాళ హీరో కాదు తెలుగువాడే .. మన తెలుగు హీరో అన్నంతగా ఇక్కడ తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాతో దుల్కర్ ను ఓన్ చేసుకున్నారు. ఆ తర్వాత దుల్కర్ నటించిన ఏ సినిమా వచ్చిన తెలుగులో మిడిల్ రేంజ్ హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా దుల్కర్ స‌ల్మాన్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్ దీపావళి కానుక‌గా రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తుండగా కంప్లీట్ డ్రామా తెరకెక్కుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్లు - టీజర్ - ట్రైలర్లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి.

ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో లక్కీ భాస్కర్ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సరికొత్త రికార్డు క్రియేట్ చేయనుంది. అక్టోబర్ 31న వరల్డ్ వైడ్గా లక్కీ భాస్కర్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు ప్రీమియర్ షోలు వేస్తామని నిర్మాత నాగవంశీ గతంలోనే చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే లక్కీ భాస్కర్ సినిమాను ఏపీ - తెలంగాణ రాష్ట్రాలలో భారీ స్థాయిలో ప్రీమియర్ షోలు వేస్తున్నారు. అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం 6 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ఏకంగా వందకు పైగా ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు.

ఈ ప్రీమియర్లకు భారీ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. సినిమాలో అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా ... జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ - ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: